PMI ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

PMI ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
విశాఖ అతిమేత్రాసనం, విశాఖపట్నం లోని కేంద్ర కారాగారంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖపట్టణ మేత్రాసన సమన్వయకర్త గురుశ్రీ యన్నం జాకబ్ గారి సారధ్యంలో ఈ వేడుకలు జరిగాయి.
సమావేశంలో ఎన్నో ఏళ్లుగా నిస్వార్థమైన సేవ చేస్తూ ఖైదీలలో మార్పు కొరకు పాటుపడుతూ, వారికొరకు ప్రార్థిస్తున్నా విశాఖపట్నం PMI(భారత చెరసాల పరిచర్య ) సభ్యులు పాల్గొన్నారు.
మహిళా ఖైదీల విభాగంలో సిస్టర్ మేరీ జేమ్స్, శ్రీమతి నిర్మల మేరీ,శ్రీమతి విజయ ,పునీత అన్నమ్మ సిస్టర్స్ , పునీత జోసెఫ్ కాలేజీ స్టూడెంట్స్ పాలొన్నారు.
జోసెఫ్ కాలేజీ స్టూడెంట్స్ ఖైదీలలో పశ్చత్తాప భావాన్ని నింపుతూ వివిధ సాంస్కృతిక నాటకాలు,పాటలు,నృత్యాలు వేసారు.
PMI సభ్యులు ఖైదీలకు కొన్ని ఆటలపోటీలు నిర్వహించారు. గెలిచినవారికి బహుమతులు అందించారు.
గురుశ్రీ యన్నం జాకబ్ గారి ఆధ్వర్యంలో PMI (భారత చెరసాల పరిచర్య ) సభ్యులు ప్రతి నెలా వీరిని సందర్శిస్తున్నారు. ప్రభు యేసుని అపారమైన ప్రేమ, జాలి, కరుణను ఖైదీలకు తెలియజేస్తూ, పవిత్ర గ్ర౦థమైన బైబిలులోని శ్రేష్ఠమైన పాత్రల గురి౦చి ఖైదీలకు వివరిస్తున్నారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer