పునీత విన్సెంట్ డి పాల్
పునీత విన్సెంట్ డి పాల్
పునీత విన్సెంట్ డి పాల్ గారు ఫ్రాన్స్ దేశంలో గాస్కొని ప్రాంతంలోగల డక్స్ పట్టణదాపులోని 'పొయి' గ్రామంలో క్రీ.శ|| 1581 ఏప్రిల్ 24న జన్మించారు. పునీత విన్సెంట్ డి పాల్ గారి తండ్రి జీన్ దె పాల్, తల్లి బెర్ట్రాండ్ దె మోరస్. వీరిది పేద రైతుకుటుంబం. వీరికి గల నలుగురు మగ పిల్లలు ఇద్దరు కుమార్తెల్లో విన్సెంట్ గారు మూడో సంతానం.
తల్లిదండ్రులు పేదవారు ఐనప్పటకి బాలుడైన విన్సెంట్ డి పాల్ గారి తెలివితేటలూ చూసి వారిని డక్స్ పట్టణంలోగల ఫ్రాన్సిస్కన్సభ వారి విద్యాలయంలో చేర్పించారు.
విన్సెంట్ గారు తామొక మంచి గురువు కావాలని ఫ్రాన్స్ లోని ఫ్రాన్సిస్కన్నారి సభలో సభ్యుడయ్యారు. టౌలౌస్ నగరంలోని విశ్వవిద్యాలయంలో తమ విద్యను కొనసాగించి తమ 24వ ఏట క్రీ||శ|| 1600 సెప్టెంబరు 23న శ్రీసభ జూబిలీ సంవత్సరంలో పవిత్ర గురుపట్టాభిషిక్తులై ప్రథమ దివ్య బలిపూజనర్పించారు. 1604లో టౌలౌస్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు.
అతను బార్బరీ సముద్రపు దొంగలచే సముద్రంలో బంధించబడ్డాడు మరియు బానిసగా విక్రయించబడ్డాడు, కానీ చివరికి తప్పించుకున్నాడు. అతను తన చదువును కొనసాగించడానికి రోమ్‌లో ఒక సంవత్సరం గడిపాడు మరియు తరువాత పారిస్‌కు వెళ్ళాడు , అక్కడ అతను శాశ్వతంగా ఉన్నాడు
పారిస్ నగరంలోని పేదల మధ్య ఆధ్మాతిక సేవలతోపాటు దాతృత్వపు సేవలుకూడా అందించడం ప్రారంభించారు. ధనిక వర్గంలోని మహిళలలో సామాజిక స్పృహను తీసుకువచ్చి డాటర్స్ ఆఫ్ చారిటీ అనగా “దాతృత్వపు మహిళలు” అనే సభను పునీత లూయిసె దె మరిల్లాక్ అను కన్యామణి వారి నేతృత్వంలో ఒక సభను స్థాపింప చేయడంలో విన్సెంటుగారు కృషిచేశారు.
ఈ సభవారు అందించిన విరాళంతో పారిలో పెద్ద వైద్యశాలను నిర్వహించారు. ఇక్కడ అనేకమంది అనాథలకు ఆశ్రయం కల్పించారు. పని, ప్రార్థన సౌకర్యాలను ఏర్పరచారు. వీటితోపాటు అనాథ శిశువుల ఆశ్రమం. వృద్ధుల శరణాలయం స్థాపించారు. ఒక పిచ్చాసుపత్రిని, కుష్ఠరోగుల సంక్షేమ సంస్థనుకూడ విన్సెంట్ గారు ఏర్పాటు చేశారు. వీటి ఆలన పాలన చారిటీ మఠకన్యలు చూసుకునేవారు. పలు అపాయాలనుండి సంరక్షించేందుకు యువతులకు, దిక్కులేని స్త్రీలకు మఠాలలో ఆశ్రయం కల్పించారు.
పునీత విన్సెంట్ డి పాల్ గారు ప్రాథమికంగా పేదల పట్ల దాతృత్వం మరియు కనికరం చూపించే వ్యక్తిగా గుర్తింపు పొందారు. క్రీ|| శ|| 1660 సెప్టెంబరు 27న శాశ్వతంగా ప్రభుచెంతకు చేరుకున్నారు. వారి పవిత్రశరీరం పారిలోని సెయింట్ లాజరె దేవాలయంలో పదిలపరచబడింది. 13వ బెనడిక్ట్ పోపుగారు 1729లో ధన్యత పట్టానివ్వగా 1737లో 12వ క్లెమెంటు పోపుగారు పునీత పట్టా ప్రకటించారు. 13వ లియో (సింహరాయులు) పోపుగారి ద్వారా దాతృత్వపు సేవలకు అంకితమైన అన్ని సంస్థలు, సంఘాలకు పునీత విన్సెంట్ దె పాల్ గార్ని పాలక పునీతులుగా శ్రీ సభ ఏర్పాటు చేసింది.
సొసైటీ ఆఫ్ సెయింట్ విన్సెంట్ డి పాల్, పేదల సేవకు అంకితం చేయబడిన ఒక కాథలిక్ స్వచ్ఛంద సంస్థ, 1833లో బ్లెస్డ్ ఆంటోయిన్ ఫ్రెడరిక్ ఓజానామ్ చేత ఇది స్థాపించబడింది.