క్రొయేషియా అధ్యక్షుడుతో సమావేశమైన పోప్ లియో
  అక్టోబర్ 31 శుక్రవారం ఉదయం వాటికన్లోని అపోస్టోలిక్ ప్యాలెస్లో క్రొయేషియా రిపబ్లిక్ అధ్యక్షుడు జోరాన్ మిలానోవిక్ను పోప్ లియో స్వాగతించారు.
అధ్యక్షుడు జోరాన్ వాటికన్ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్తో పాటు రాష్ట్రాలు మరియు అంతర్జాతీయ సంస్థలతో సంబంధాల బహుళ పక్ష విభాగానికి అండర్ సెక్రటరీ మోన్సిగ్నోర్ Daniel Pachoతో కూడా సమావేశమయ్యారు అని హోలీ సి ప్రెస్ ఆఫీస్ పేర్కొంది.
సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్లో జరిగిన ఈ సమావేశంలో, రెండు పార్టీలు వాటికన్ మరియు క్రొయేషియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల" పట్ల సంతృప్తిని వ్యక్తం చేశాయని హోలీ సీ ప్రెస్ ఆఫీస్ తెలిపింది.
అంతర్జాతీయ మరియు ప్రాంతీయ స్వభావం గల వివిధ అంశాలపై చర్చించారు ప్రత్యేకించి పశ్చిమ బాల్కన్ ప్రాంతం పై దృష్టి సారించారు అని హోలీ సి పేస్ ఆఫీస్ పేర్కొంది