సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క అవశేషాల యొక్క దశాబ్దాల ప్రదర్శనతో పాటు, గోవా మరియు డామన్ ఆర్చ్ డియోసెస్ 2024 నవంబర్ 17న పాత గోవాలోని సెయింట్ జాన్ ఆఫ్ గాడ్ యొక్క చారిత్రాత్మక కాన్వెంట్లో "ఫుట్‌ప్రింట్స్ ఆఫ్ హోప్" పేరుతో ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ప్రారంబించారు. గోవా మరియు డామన్ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య కార్డినల్ ఫిలిప్ నెరి ఫెర్రో గారు ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో కొనసాగుతున్న హింసాకాండలో సెయింట్ గ్రెగోరీస్ స్కూల్ మరియు కాలేజీ పై దాడి జరిగింది. నవంబరు 24న కతోలిక విద్యాసంస్థపై ఒక విద్యార్థుల బృందం దాడి చేసింది. దాడి చేయడంతో తరగతులను నిలిపివేయాల్సి వచ్చింది.
విశాఖ అతిమేత్రాసనం, ఎర్ర సామంత వలస గిరిజన విచారణ లో క్రీస్తు రాజు పుణ్యక్షేత్రం ఆవిర్భావ వేడుకలకు సిద్ద పడుతూ మొదటి రోజు నవదిన పూజా ప్రార్థనలు ఘనంగా జరిగాయి.
భారతదేశంలోని ఇంఫాల్‌కు చెందిన అగ్రపీఠాధిపతులు మహా పూజ్య లినస్ నెలి గారు సంఘర్షణతో దెబ్బతిన్న మణిపూర్ రాష్ట్రంలోని క్రైస్తవ సమాజానికి మతపరమైన మరియు జాతి హింసాకాండను ఎదుర్కోవడంలో వారికి "నిజంగా సహాయం కావాలి" అని అన్నారు.
విశాఖఅతిమేత్రాసనం జ్ఞానాపురం విచారణ లో నవంబర్17, ఆదివారం సాయంకాలం రక్షణగిరిలో "క్రీస్తు రక్షకుని యాత్రమహోత్సవ" పండుగ వేడుకలను పురస్కరించుకొని 2025 వ సంవత్సరం గాను అమృత వాణి బైబిల్ డైరీ ని ఆవిష్కరించారు.