భారతదేశం, పాకిస్తాన్ మరియు , నేపాల్ లో వరద బాధితుల కోసం పోప్ ప్రార్థనలు చేశారు

భారతదేశం, పాకిస్తాన్ మరియు , నేపాల్ లో వరద బాధితుల కోసం పోప్ ప్రార్థనలు చేశారు


కాస్టెల్ గాండోల్ఫోలో ప్రార్థన తర్వాత,  భారత పాలిత కాశ్మీర్‌ మరియు పాకిస్తాన్, నేపాల్ లలో సంభవించిన ఆకస్మిక వరదలలో మృతి చెందిన వారిని,  బాధిత కుటుంబాలను పరిశుద్ధ లియో XIV  పాపు గారు గుర్తుచేసుకున్నారు.  "బాధితుల కోసం మరియు వారి కుటుంబాల కోసం, మరియు ఈ విపత్తు ఫలితంగా బాధపడుతున్న వారందరి కోసం"  ప్రత్యేక ప్రార్థనలను చేసారు.


ప్రపంచంలో శాంతి కోసం తన నిరంతర పిలుపులను పునరుద్ఘాటిస్తూ, యుద్ధాలను అంతం చేయడానికి మరియు శాంతిని ప్రోత్సహించడానికి చేసే ప్రయత్నాలు ఫలించాలని పరిశుద్ధ లియో XIV  పాపు గారు ప్రార్ధించారు. "దేశాల మధ్య జరిగే ప్రతి చర్చలలో, ప్రజల మంచి కొరకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వబడాలని" పరిశుద్ధ లియో XIV  పాపు గారు తన కోరికను వ్యక్తం చేశారు.

వాయువ్య పాకిస్తాన్, భారత పాలిత కాశ్మీర్ మరియు నేపాల్‌లో రెండు రోజుల పాటు కుండపోత వర్షాలు మరియు ఆకస్మిక వరదల కారణంగా  300 మందికి పైగా మరణించారు. ఈ  వర్షాల కారణంగా సంభవించిన వరదలు ఎక్కువగా ఉత్తర పాకిస్తాన్ మరియు భారత పాలిత కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలను నాశనం చేశాయి.

నియంత్రణ రేఖ వెంబడి, భారత పాలనలో ఉన్న కాశ్మీర్ కూడా అతలాకుతలమైంది, ముఖ్యంగా కిష్త్వార్ జిల్లాలో కనీసం 60 మంది మరణించినట్లు నిర్ధారించబడింది. తప్పిపోయిన డజన్ల కొద్దీ వ్యక్తుల కోసం సహాయక బృందాలు వెతుకుతూనే ఉన్నాయి. 150 మందికి పైగా గాయపడ్డారు మరియు ఆస్తి నష్టం స్థాయిని ఇంకా అంచనా వేస్తున్నారు.

జూన్ 24 నుండి జూలై 23 వరకు పాకిస్తాన్‌లో వర్షపాతం సాధారణం కంటే 10–15% ఎక్కువగా నమోదైందని, ఇది వాతావరణ మార్పుకు నేరుగా ముడిపడి ఉందని ప్రపంచ శాస్త్రవేత్తల బృందం వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ ఇటీవల అంచనా వేసింది.

Article and Design by : M. Kranthi Swaroop