తెలుగు ప్రాంతీయ న్యాయవాదుల వార్షిక సమావేశం

తెలుగు ప్రాంతీయ న్యాయవాదుల వార్షిక సమావేశం
సికింద్రాబాద్ లోని సెయింట్స్ మేరీస్ కాలేజ్ లో "తెలుగు ప్రాంతీయ న్యాయవాదుల వార్షిక సమావేశం" ఘనంగా మొదలయినది. రెండు రోజులు (ఆగష్టు 22,23 ) జరగనున్న ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలనుండి వచ్చిన కతోలిక న్యాయవాదులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏలూరు పీఠకాపరి మహా పూజ్య డా. పొలిమేర జయరావు గారు పాల్గొని తన అమూల్యమైన సందేశాన్ని న్యాయవాదులకు అందించారు.
ఆంధ్ర తొలి మహిళా ఐపీఎస్ - రిటైర్డ్ అధికారిణి అరుణ బహుగుణ ఈ కార్యక్రమంలో పాల్గొని "క్లిష్ట సమయాల్లో సంసిద్ధత" అనే అంశం పై ప్రసంగించారు.
ఫాదర్ మల్లవరపు సుందర్ గారు "కతోలిక వివాహం మరియు దాని విధానాలు" అని అంశం పై ప్రసంగించారు. శ్రీ తోమాస్ గారు "భారతదేశంలో కుటుంబ చట్టాలు" అనే అంశం పై మాట్లాడారు.
జూబిలీ సంవత్సరం న్యాయవాదుల సహకారం అనే అంశం పై కతోలిక పీఠాధిపతుల సమాఖ్య సెక్రటరీ ఫాదర్ రాజు అలెక్స్ గారు మాట్లాడారు. ఈ కార్యక్రమం రెండవ రోజు అయిన ఆగష్టు 23 న కూడా కొనసాగనున్నది.
Article and Design: M. Kranthi Swaroop