మనం దేవుని అత్యంత అందమైన సృష్టి : పరిశుద్ధ లియో పాపు గారు

మనం దేవుని అత్యంత అందమైన సృష్టి :  పరిశుద్ధ లియో పాపు గారు

పొంటిఫికల్ విల్లాస్ గార్డెన్స్‌(Gardens of the Pontifical Villas)లో పేదలతో భోజనం పంచుకునే ముందు, మనలో ప్రతి ఒక్కరూ దేవుని స్వరూపంలో సృష్టించబడ్డారని మరియు "మనం ప్రతి ఒక్కరిలో దేవుని ఉనికిని కనుగొనగలము" అని పరిశుద్ధ లియో XIV  పాపు గారు వివరించారు. 

ఈ కార్యక్రమంలో కార్డినల్ ఫాబియో బాగ్గియో గారు, అల్బానో బిషప్ విన్సెంజో వివా గారు , ఇతరలు పాల్గొన్నారు. అల్బానో బిషప్ విన్సెంజో వివా గారు  స్వాగతం పలుకుతూ, అతిథులను పరిశుద్ధ లియో XIV  పాపు గారికి పరిచయం చేసారు. 

ప్రకృతి అందాల మధ్య కారిటాస్ అల్బానో మద్దతు ఉన్న "పేదలతో భోజనం"  ఏర్పాటు సందర్భముగా  పరిశుద్ధ లియో XIV పాపు గారు మాట్లాడుతూ, " సృష్టిలో అత్యంత అందమైనది దేవుని స్వరూపంలో సృష్టించబడిన మనమే అని , అంటే, మనలో  "ప్రతి ఒక్కరూ విలువైన వారమనే" వాస్తవాన్ని ప్రతిబింబించమని ప్రతి ఒక్కరినీ కోరారు.

ప్రతి వ్యక్తి, దేవుని ప్రతిరూపాన్ని ప్రతిబింబిస్తాడని ఈ సందర్భముగా పరిశుద్ధ లియో XIV  పాపు గారు అన్నారు. ఈ సత్యాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడం చాలా అవసరం అని , ప్రతి వ్యక్తిలో మనం దేవుని ఉనికిని చూడగలమని అని అన్నారు. ఈ మధ్యాహ్నం భోజన సమావేశం ముఖ్యంగా దేవునితో కలిసి ఉండటం అలాగే  ఒకరి కొకరు సోదరభావంతో కలసి ఈ సహవాస అనుభవం "ఆయన నామాన్ని మహిమపరుస్తుంది" అని పరిశుద్ధ లియో XIV  పాపు గారు అన్నారు.

అల్బానో మేత్రాసన  కారిటాస్ మద్దతు ఇస్తున్న "పేదలు, నిరాశ్రయులైన ప్రజలు, వివిధ అనాదశరణాల నివాసితులు, ఇతర సంస్థలనుండి వచ్చిన  వంద మందికి పైగా అతిథులను చూస్తూ, పరిశుద్ధ లియో XIV  పాపు గారు  "కలిసి రొట్టె విరుచుట, మనందరికీ చాలా ముఖ్యమైనది అని, ఇది మన మధ్య యేసుక్రీస్తు ప్రభువుని ఉనికిని మనం గుర్తించే చర్య" అని అన్నారు.

Article and Design: M. Kranthi Swaroop