సెయింట్ థెరిసా హాస్పిటల్ - శంషాబాద్ శాఖ (St.Theresa's Hospital - Shamshabad) వారి ఆధ్వర్యంలో శంషాబాద్ సమీపంలోని గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరం కొనసాగుతోంది.
విశాఖ అతిమేత్రాసనం,ఎర్ర సామంత వలస గిరిజన విచారణ, క్రీస్తు రాజు పుణ్యక్షేత్రంలో ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఎర్ర సామంత వలస విచారణ ప్రజలు అధికసంఖ్యలో పాల్గొన్నారు .
విశాఖ అతిమేత్రాసనం, మక్కువ విచారణ, పరిశుద్ధ ఫాతిమా మాత దేవాలయ పునః నిర్మాణ ప్రతిష్ఠోత్సవము ఘనంగా జరిగింది. విచారణ కర్తలు గురుశ్రీ మరియాదాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
విశాఖ అగ్రపీఠం, కోటనరవ విచారణలో పునీత మధర్ తెరేసా దేవాలయ మహోత్సవము ఘనంగా జరిగింది. విచారణ కర్తలు గురుశ్రీ రత్నకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
గుంటూరు మేత్రాసనం సహకారంతో క్లారెట్ ధ్యాన బృందం వారు అక్టోబర్ 27 నుండి 29, 2024 వరకు భట్టిప్రోలులోని సెయింట్ క్లారెట్ ధ్యాన ఆశ్రమంలో మరియదళ సభ్యులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.