జీవిత ఖైదు, రూ. 10 లక్షల జరిమానా: ఉత్తరాఖండ్ మతమార్పిడి బిల్లు

జీవిత ఖైదు, రూ. 10 లక్షల జరిమానా: ఉత్తరాఖండ్ మతమార్పిడి బిల్లు
డెహ్రాడూన్: "ఉత్తరాఖండ్ కేబినెట్" బుధవారం కఠినమైన ఉత్తరాఖండ్ మత స్వేచ్ఛ (సవరణ) బిల్లు, 2025 కు ఆమోదం తెలిపింది.
కొత్తగా ఆమోదం పొందిన ఉత్తరాఖండ్ మత స్వేచ్ఛ (సవరణ) బిల్లు - 2025 లో అనేక కఠిన నిబంధనలు చేర్చారు. ప్రధానంగా ఈ సవరణల ద్వారా శిక్షలను కఠినతరం చేయడంతో పాటు కొన్ని కొత్త అంశాలను నేరంగా పరిగణించారు.
"బలవంతపు మతమార్పిడులకు" పాల్పడిన వ్యక్తులకు మూడు సంవత్సరాల నుండి జీవిత ఖైదు వరకు జైలు శిక్షలను మరియు రూ. 10 లక్షల వరకు జరిమానా అనుమతించేలా మత స్వేచ్ఛ (సవరణ) బిల్లును ఆగస్టు 13న ఉత్తరాఖండ్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.
కొత్త చట్టం ప్రకారం.. సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లు, ఏదైనా ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా మత మార్పిడులను ప్రోత్సహించడం, ప్రేరేపించడం కూడా శిక్షార్హమైన నేరం అవుతుంది.
కొత్త బిల్లు సాధారణ ఉల్లంఘనలకు 3 నుండి 10 సంవత్సరాల జైలు శిక్ష, సున్నితమైన కేసులకు సంబంధించిన కేసుల్లో 5 నుండి 14 సంవత్సరాల జైలు శిక్ష మరియు తీవ్రమైన కేసుల్లో 20 సంవత్సరాల నుండి జీవిత ఖైదు, భారీ జరిమానాలతో పాటు ప్రతిపాదించింది.
ఆగస్టు 19 నుండి ప్రారంభమయ్యే మూడు రోజుల అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఆమోదం కోసం ప్రభుత్వం ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
బుధవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన రెండో సవరణ చట్టంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో ఈ నేరానికి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, అత్యధిక జరిమానా రూ. 50,000 గా ఉంది.
ఉత్తరాఖండ్‌ను హిందూ అనుకూల భారతీయ జనతా పార్టీ (BJP) పాలిస్తోంది మరియు 2018 నుండి మతమార్పిడి నిరోధక చట్టం అమలులో ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రెండవసారి పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
బిజ్నోర్ డియోసెస్ ఫాదర్ జింటో అరింబుకరం గారు మాట్లాడుతూ, క్రైస్తవ సమాజం “దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగోచ్చుఅని , చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా” జాగ్రత్త వహించాలని అన్నారు.“మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మన సాధారణ ఆదివారం ప్రార్థనలు మరియు సేవలు లేదా ఏదైనా ఇతర దేవాలయ విధులను మత మార్పిడి కార్యకలాపాలుగా ముద్ర వేయవచ్చు” అని ఫాదర్ జింటో గారు ఆగస్టు 14న UCA న్యూస్‌తో అన్నారు.
మేము 50 సంవత్సరాలకు పైగా రాష్ట్రంలో పనిచేస్తున్నాము, అవసరంలో ఉన్న ప్రజలకు మా సేవలను అందిస్తున్నాము, ఎప్పుడు కూడా ఎటువంటి సమస్యను ఎదుర్కోలేదు” అని ఫాదర్ జింటో అరింబుకరం గారు అన్నారు.
Article and Design: M. Kranthi Swaroop