మలేసియా అత్యున్నత రాష్ట్ర బిరుదు అందుకున్న కుచింగ్ అగ్రపీఠాధిపతులు

సర్వాక్ ప్రభుత్వం డార్జా పంగ్లిమా సెటియా బింటన్ సర్వాక్ (PSBS) అవార్డును కుచింగ్  అగ్రపీఠాధిపతులు సైమన్ పోహ్ కు ప్రదానం చేసింది, దీనికి ‘డాటో’ అనే పేరు పెట్టారు.

‘డాటో’ మలేసియా దేశానికి ఎంతో సేవ చేసిన వ్యక్తులకు ఇచ్చే అత్యధిక రాష్ట్ర బిరుదు 

తుహిన్ శ్రీ డాక్టర్ వాన్ జునైద్ టౌన్కు జాఫరు 78వ పుట్టినరోజు సందర్భంగా అగ్రపీఠాధిపతులు పోహ్ గారు ఇతర రాష్ట్ర అవార్డు గ్రహీతలతో కలిసి ఈ బిరుదు అందుకున్నారు.

ప్రభుత్వంతో కతోలిక శ్రీసభ కలిసి సరవాక్ అంతటా పిల్లలకు విద్య అందించడానికి చేస్తున్న కృషిని అగ్రపీఠాధిపతులు ప్రస్తావించారు.

“ఎన్నో ఏళ్ళ పాటు నగరాలు, పట్టణాలు, మరి ముఖ్యంగా సరవాక్ లోపలి భాగంలో ఉన్న కమ్యూనిటీలలో వారికి  62 కతోలిక విద్య సంస్థలు నుండి వేలాది మంది పిల్లలకు విద్య అందుబాటులో ఉంది” అని ఆయన అన్నారు.

"సామరస్యం మరియు పరస్పర అవగాహన కోసం మతాంతర సమావేశాలు నిర్వహించి, మేము మత పెద్దల మధ్య విశ్వాసం మరియు స్నేహాన్ని పెంచుకున్నాము" అని ఆయన అన్నారు 

సరవాక్‌లోని మరో ఇద్దరు పీఠాధిపతులు, సిబు పీఠాధిపతులు  మహాపూజ్య జోసెఫ్ హి మరియు మిరీ పీఠాధిపతులు మహా పూజ్య రిచర్డ్ ఎన్‌జి లకు తన సంఘీభావాన్ని తెలియజేస్తూ, కతోలిక శ్రీసభను గౌరవించినందుకు సరవాక్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Tags