సినడ్ సెక్రటేరియట్ కౌన్సిల్‌ సభ్యునిగా కార్డినల్ ఫిలిప్ నెరి ఫెర్రో ఎన్నిక

గోవా మరియు డామన్ అగ్రపీఠాధిపతులు,కాన్ఫరెన్స్ ఆఫ్ కాథలిక్ బిషప్స్ ఆఫ్ ఇండియా (CCBI), ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బిషప్స్' కాన్ఫరెన్స్ (FABC) అధ్యక్షులు,  కార్డినల్ మహా పూజ్య ఫిలిప్ నెరి గారు సినడ్ జనరల్ సెక్రటేరియట్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికయ్యారు. 

ఈ ఎన్నిక అక్టోబర్ 23, 2024న పీఠాధిపతుల సినడ్ 15వ జనరల్ కాంగ్రెగేషన్ సందర్భంగా జరిగింది.

ఈ నెల ప్రారంభంలో, అక్టోబర్ 9న, కతోలిక  ధర్మసభ పరిపాలన విధివిధానాల (Synod on Synodality ) చివరి సాక్షాధార పత్రాన్ని రూపొందించే బాధ్యత కమిటీకి పోప్ ఫ్రాన్సిస్ కార్డినల్ ఫెర్రోను నియమించారు.

ప్రస్తుతం కొనసాగుతున్న సినడ్ రెండవ సమావేశం అక్టోబర్ 2 న ప్రారంభమై, అక్టోబర్ 27, 2024 న ముగిసాయి.

జనరల్ సెక్రటేరియట్ సాధారణ కౌన్సిల్ వారు సాధారణ అసెంబ్లీకి  సిద్ధంపరచడానికి    మరియు అమలు చేయడానికి బాధ్యత వహించనున్నారు

ఆర్డినరీ కౌన్సిల్ సభ్యులు వారిని ఎన్నుకున్న సాధారణ అసెంబ్లీ ముగింపులో పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.

పరిశుద్ధ పాపు ఫ్రాన్సిస్ గారి అధ్యక్షతన కౌన్సిల్ జనరల్ సెక్రటేరియట్‌లో అంతర్భాగం.

CCBI అధ్యక్షులు కార్డినల్ ఫిలిప్ నెరి ఫెర్రో, ఆగస్ట్ 27, 2022న  ఫ్రాన్సిస్ పాపు గారి  చేత కార్డినల్‌గా నియమింపబడ్డారు .

ఆయన  2019లో CCBI 31వ ప్లీనరీ అసెంబ్లీకి అధ్యక్షుడిగా మరియు 2022లో 33వ ప్లీనరీ అసెంబ్లీలో తిరిగి ఎన్నికకాబడ్డారు 
 

Tags