హానోయి అగ్రపీఠానికి సహాయ పీఠాధిపతిగా గురుశ్రీ జోసఫ్ వు కాంగ్ వియెన్ నియామకం
హానోయి అగ్రపీఠానికి సహాయ పీఠాధిపతిగా గురుశ్రీ జోసఫ్ వు కాంగ్ వియెన్ నియామకం
అక్టోబర్ 26 ,2024 న పరిశుద్ధ పాపు ఫ్రాన్సిస్ గారు వియత్నాంలోని హా నోయి అగ్రపీఠ వికార్ గురుశ్రీ జోసఫ్ వు కాంగ్ వియెన్ ను అదే అగ్రపీఠానికి కొత్త సహాయ పీఠాధిపతిగా నియమిస్తూ ప్రకటన చేసారు.
గురుశ్రీ జోసఫ్ వు గారు మార్చి 23, 1973న హా నోయి అగ్రపీఠంలోని టాన్ డోలో జన్మించారు.
అతను హా నోయిలోని సెయింట్ జోసెఫ్ మేజర్ సెమినరీలో తత్వశాస్త్రం మరియు వేదాంతశాస్త్రం అభ్యసించారు.
డిసెంబర్ 20, 2007న గురువుగా అభిషేకింపబడ్డారు.
2008 నుండి 2010 వరకు బిన్ కాచ్ విచారణ వికార్‌గా నియమించబడ్డారు.
2015 నుండి 2020 వరకు నామ్ డై , 2020 నుండి 2021 వరకు కి సెట్ విచారణ గురువుగా తన సేవను అందించారు.
కెనడాలోని ఒట్టావాలోని సెయింట్ పాల్స్ యూనివర్శిటీ నుండి కానన్ లా లో లైసెన్షియేట్ పొందారు .
అగ్రపీఠ వికార్‌గా కాకుండా, ఆయన 2011 నుండి సెయింట్ జోసఫ్స్ మేజర్ సెమినరీకి అకడమిక్ డీన్‌గా కూడా పనిచేసారు.