చిలీ మరియు అర్జెంటీనా స్మారక కార్యక్రమంలో పాల్గొన పొప్ ఫ్రాన్సిస్
నవంబర్ 21న డికాస్టరీ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ మొదటి ప్లీనరీ అసెంబ్లీలో పాల్గొన్నవారిని ఉద్దేశించి పోప్ ఫ్రాన్సిస్ గారు మాట్లాడుతూ, సమాజంలో సూన్యవాదాన్ని అధిగమించడానికి అభిలాష, నిర్భయత మరియు క్రైస్తవ నిరీక్షణ అవసరమని అన్నారు.
సూన్యవాదాన్ని ""బహుశా నేటి సంస్కృతి యొక్క అత్యంత ప్రమాదకరమైన తెగులు""గా అభివర్ణించినస్తూ, వారి సంస్థ మానవత్వాన్ని ప్రేరేపించే దిశగా కృషి చేయాలని డికాస్టర్ సభ్యులకు కోరారు
కతోలిక శ్రీసభ విస్తారమైన సాంస్కృతిక మరియు విద్యా వారసత్వాన్ని తన శ్రోతలకు గుర్తుచేస్తూ, “భయాందోళనతో కృంగిపోవడానికి ఎటువంటి కారణం లేదు” అని పోప్ అన్నారు.
పునీత అగస్టిన్, థామస్ అక్వినాస్, ఎడిత్ స్టీన్లను ఉదాహరణగా చూపిస్తూ ‘‘ఒక మాటలో చెప్పాలంటే, మనం ఎంతో మంది పునీతుల విద్యా, సాంస్కృతిక అభిరుచికి వారసులం’’ అని పొప్ గారు అన్నారు
పేదరికం, అసమానత మరియు మినహాయింపులను "ప్రస్తుత ప్రపంచం లోటుగా గుర్తిస్తూ, ప్రజలకు - ముఖ్యంగా పిల్లలు మరియు యువతకు - సమగ్ర విద్యను పొందేలా చేయడం శ్రీసభ "నైతిక ఆవశ్యకత" అని పొప్ గారు అన్నారు
“దాదాపు 250 మిలియన్ల మంది పిల్లలు, కౌమారదశలోని వారు పాఠశాలకు హాజరుకావడం లేదు” అని ఆయన పేర్కొన్నారు.
“ పిల్లల భవిష్యత్తును మనం దోచుకున్నప్పుడు, వారికి షరతులు పెట్టనప్పుడు అది సాంస్కృతిక మారణహోమం” అని ఆయన అన్నారు.
"సజీవుడైన క్రీస్తును ధ్యానించడం వల్ల భవిష్యత్తులోకి ప్రవేశించే ధైర్యం మనకు లభిస్తుంది" అని పోప్ ముగించారు .