మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలిగేలా గృహాల్లో ప్రత్యేక ప్రార్ధనలు చేయాలని పునీత పేతురు ప్రధాన దేవాలయ విచారణకర్తలు గురుశ్రీ జొన్నాడ ప్రకాశ్ గారు అన్నారు.
ప్రతి ఏటా నవంబర్ 1వ తేదీన మన విశ్వ కతోలిక తల్లి శ్రీసభ సకల పునీతుల యొక్క మహోత్సవాన్ని కొనియాడుతుంది . శ్రీసభ యొక్క ముఖ్యమైన పవిత్ర దినం. ఈరోజు మన తల్లి శ్రీసభ పునీతుల యొక్క జీవితాలను మనకు ఆదర్శంగా చూపిస్తూ మన అందరిని కూడా వారి బాటలో నడవమని తెలియజేస్తూ ఉన్నది .
విశాఖ అతిమేత్రాసనం, మల్కాపురం విచారణ, సెయింట్ జోసెఫ్ ది వర్కర్ (St. Joseph the Worker Catholic Church ) దేవాలయం లో మరియదళ వ్యాకులమాత ప్రెసిదియం వార్షిక వేడుకలు ఘనంగా జరిగాయి.
గోవా మరియు డామన్ అతి మేత్రాసనం పునీత ప్రాన్సీస్ శౌరి వారి (St Francis Xavier) యొక్క అవశేషాల ప్రదర్శనను ప్రకటించింది. ప్రతి 10 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఈ ప్రదర్శన ఈ సంవత్సరం 21 నవంబర్ 2024న ప్రారంభమై 5 జనవరి 2025న ముగుస్తుంది.
విశాఖ అతిమేత్రాసనం, విజయనగరం విచారణ, పునీత అంతోని వారి దేవాలయం లో మరియదళ వరప్రసాదమాత ప్రెసిదియం వార్షిక వేడుకలు ఘనంగా జరిగాయి. విచారణ కర్తలు గురుశ్రీ లూర్దు గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
సెయింట్ థెరిసా హాస్పిటల్ - శంషాబాద్ శాఖ (St.Theresa's Hospital - Shamshabad) వారి ఆధ్వర్యంలో శంషాబాద్ సమీపంలోని గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.
విశాఖ అతిమేత్రాసనం ద్రాక్షారామం విచారణలో యవ్వన దంపతుల ప్రార్ధనా సదస్సు ఘనంగా నిర్వహించారు. విచారణ కర్తలు గురుశ్రీ జోసెఫ్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.