దేవుడు మన నిరాశను తొలగిస్తాడు - పోప్ లియో XIV

దేవుడు మన నిరాశను తొలగిస్తాడు - పోప్ లియో XIV
ఇటలీ లో ఆగస్టు 15,2025న కాస్టెల్ గాండోల్ఫోలోని సెయింట్ థామస్ ఆఫ్ విల్లానోవా దేవాలయం లో మరియమాత మోక్షారోహణ మహోత్సవం ఘనంగా జరిగింది.
పరిశుద్ధ లియో XIV పాపు గారు ఈ పవిత్ర మహోత్సవ ప్రార్థనలలో పాల్గొన్నారు.
ఈ సందర్భముగా పరిశుద్ధ లియో XIV పాపు గారు మాట్లాడుతూ "దేవుడు మరణాన్ని ఎలా అధిగమించారో గుర్తు చేసారు. "ఈ రాజ్యం ఆయనది. దేవుడు మనలను చాలా ప్రేమిస్తున్నాడని, మనము ఆయనకు చెందినవారమని అన్నారు. అలాగే ప్రతిదీ మార్చగల శక్తీ ప్రేమకు ఉందని, ఆయన ప్రేమ మనది అని ఆయన వివరించారు.
యేసు ప్రభువు వారు తనను తాను అర్పించుకోవడం ద్వారా, మానవత్వం యొక్క పరిపూర్ణతను, దేవుని ప్రేమను మనకు చూపించారు అని పరిశుద్ధ లియో XIV పాపు గారు అన్నారు . ఆ సమయంలో మరియ తల్లి తన కుమారుడితో కలిసి శిలువ దగ్గర ఉందని పరిశుద్ధ లియో XIV పాపు గారు అక్కడ ఉన్నవారికి గుర్తు చేశారు.
" మరియ తల్లి పాట (Magnificat), వినయస్థులు, ఆకలితో ఉన్నవారు, దేవుని నమ్మకమైన సేవకుల ఆశను బలపరుస్తుంది." ("మాగ్నిఫికాట్" అనేది లూకా సువార్తలోని 1:46-55లో కన్య మరియమ్మ పాడిన ఒక పాట). ఆమె జీవితంలో అత్యున్నత క్షణాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాము" అని పరిశుద్ధ లియో XIV పాపు గారు అన్నారు.
"ఆ రోజును గుర్తుచేసుకోవడం చాలా అందంగా ఉంది." "ప్రతి మానవ కథ, దేవుని తల్లి కథ కూడా ఈ భూమిపై క్లుప్తంగా ఉంటుంది మరియు ముగుస్తుంది" అని పాపు గారు అన్నారు. "అయినప్పటికీ జీవితం ముగిసినప్పుడు, ఈలోకంలో మన చూపిన ప్రేమ, చేసిన మంచి, సహాయం మరింత స్పష్టంగా ప్రకాశిస్తుంది అని పాపు గారు అన్నారు.
అసాధ్యమైనదిగా అనిపించినప్పటికీ, దేవుని వాక్యం వెలుగులోకి రావడం కొనసాగుతుందని పరిశుద్ధ లియో XIV పాపు గారు హామీ ఇచ్చారు. ఈ సందర్భముగా పేద మరియు హింసించబడిన క్రైస్తవ సంఘాలను పరిశుద్ధ లియో XIV పాపు గారు గుర్తుచేసుకున్నారు.
మరియ తల్లి కృప మరియు స్వేచ్ఛ కలిగిన అద్భుతమైన ఐక్యత అని, మన జీవితంలో నమ్మకం, ధైర్యం కలిగి ఉండేలా ఎల్లప్పుడూ మనలని ప్రేరేపిస్తుంది అని పరిశుద్ధ లియో XIV పాపు గారు. చివరిగా దేవుడు మన నిరాశను తొలగిస్తాడు అని, మనలో ప్రతి ఒక్కరినీ దేవుని యందు నమ్మకంగా ఉండమని పరిశుద్ధ లియో XIV పాపు గారు అన్నారు.
Article and Design: M. Kranthi Swaroop