ప్రేమ మరియు దయలో పెట్టుబడి పెట్టండి - పోప్ లియో XIV

ప్రేమ మరియు దయలో పెట్టుబడి పెట్టండి - పోప్ లియో XIV
ఆదివారం ఏంజెలస్ లో ప్రార్థనల సమయంలో సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో గుమిగూడిన విశ్వాసులను ఉద్దేశించి పరిశుద్ధ లియో పాపు గారు మాట్లాడుతూ తమ జీవితాల “నిధి”ని ఎలా పెట్టుబడి పెడుతున్నారో తమను తాము ప్రశ్నించుకోవాలని విశ్వాసులను కోరారు.
"మీ దగ్గర ఉన్నవాటిని అమ్మేసి దానధర్మాలు చేయండి" అనే ప్రభు యేసు క్రీస్తు వారి మాటలను గుర్తుచేస్తూ క్రైస్తవులు దేవుని నుండి పొందిన బహుమతులను అంటిపెట్టుకుని ఉండకూడదని, వాటిని ఇతరుల మంచి కోసం, ముఖ్యంగా అవసరంలో ఉన్నవారి కోసం ఉదారంగా ఉపయోగించాలని పరిశుద్ధ పాపు గారు కోరారు.
ఇది కేవలం భౌతిక సంపదలను పంచుకోవడం గురించి మాత్రమే కాదు, మన సామర్థ్యాలు, మన సమయం, మన ఆప్యాయత, మన ప్రేమ, మన సానుభూతిని పంచుకోవడం అని ఆయన అన్నారు. ప్రతి వ్యక్తి, "దేవుని ప్రణాళికలో ఒక ప్రత్యేకమైన వారిగా సృష్టించబడమని, దానిని సద్వినియోగం చేసుకొనేలా "ప్రేమ మరియు దయ"లో పెట్టుబడి పెట్టాలి అని , "లేకపోతే అది దాని విలువను కోల్పోతుంది అని అన్నారు. '
అన్నింటికంటే ముఖ్యంగా, జీవితానికి ప్రేమ అవసరం ఎంతో ఉంది అని , "ఇది మన ఉనికిలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుందని, మనల్ని దేవుడికి మరింత దగ్గర చేస్తుంది అని అన్నారు. .
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer