కడప మేత్రాసనం, ఆరోగ్యమాత పుణ్య క్షేత్రంలో 8 సెప్టెంబర్ 2024 న ఆరోగ్యమాత మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలు పుణ్యక్షేత్రం డైరెక్టర్ గురుశ్రీ MD ప్రసాద్ గారి అద్వర్యంలో జరిగాయి.
తైమూర్-లెస్టే చేరుకున్న పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు తన అపోస్టోలిక్ జర్నీలో భాగంగా మూడవ దశను లోనికి అడుగు పెట్టారు. ఇండోనేషియా, పాపువా న్యూ గినియా పర్యటనలు విజయవంతంగా ముగించుకుని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు సోమవారం కతోలికులు అత్యధికంగా ఉన్నదేశమైన తైమూర్-లెస్టేను చేరుకున్నారు.
ఇండోనేషియా కథోలికులు విశ్వాసం, ఐక్యత మరియు కరుణను కలిగి ఉండాలి : పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు
సెప్టెంబరు 4న, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు జకార్తాలోని కేథడ్రల్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది అజంప్షన్లో మతాధికారులను మరియు మత పెద్దలను ఉద్దేశించి ప్రసంగించారు.
సెప్టెంబరు 3న నాలుగు రోజుల పర్యటన కోసం ఇండోనేషియాకు చేరుకున్న తర్వాత జకార్తాలోని అపోస్టోలిక్ న్యాన్సియేచర్కు చేరుకున్న పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారికి స్వాగతం పలికిన 40 మందిలో వృద్ధులు, పనివారు, వీధి పిల్లలు మరియు శరణార్థులు ఉన్నారు
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు జకార్తాకు రావడానికి ఒక రోజు ముందు, ఇండోనేషియా ప్రభుత్వం పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి మూడు రోజుల పర్యటనకు గుర్తుగా ప్రత్యేక పోస్టల్ స్టాంపులను విడుదల చేసింది.