భారత్ , పాకిస్తాన్ మధ్య శాశ్వత శాంతి కోసం కార్డినల్ గ్రేసియాస్ పిలుపునిచ్చారు

భారత్ , పాకిస్తాన్ మధ్య శాశ్వత శాంతి కోసం కార్డినల్ గ్రేసియాస్ పిలుపునిచ్చారు

కాశ్మీర్ ప్రాంతంలో ఉద్రిక్తతల మధ్య, భారతదేశం మరియు పాకిస్తాన్ దేశాల మధ్య శాశ్వత శాంతికి ఒక మార్గాన్ని కనుగొనాలని బొంబాయి ఆగ్రపీఠాధిపతులు మహా పూజ్య  ఎమెరిటస్ కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేసియాస్ గారు పిలుపునిచ్చారు.

ఏప్రిల్ 22న పహల్గామ్ లో ఉగ్రవాదులు ఉగ్రవాద దాడి చేసి 26 మంది పౌరులను చంపిన తర్వాత ఇటీవల ఉద్రిక్తతలు పెరిగాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన "ఆపరేషన్ సిందూర్‌" తర్వాత భారత్‌-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి.

మే 10న కాల్పుల విరమణకు అంగీకారం కుదిరే వరకు రెండు వైపులా నాలుగు రోజుల పాటు ప్రతీకార దాడులు జరిగాయి.

మరుసటి రోజు, మే 11న పోప్ లియో XIV భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను స్వాగతించారు, "త్వరలో శాశ్వత ఒప్పందం కుదుర్చుకోవచ్చని" ఆశాభావం వ్యక్తం చేశారు.

బొంబాయి ఆగ్రపీఠాధిపతులు మహా పూజ్య  ఎమెరిటస్ కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేసియాస్ గారు  "ఇది శాంతికి సమయం" అని పోప్ విజ్ఞప్తికి తన స్వరాన్ని జోడించారు.

మహా పూజ్య  ఎమెరిటస్ కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేసియాస్ గారు మాట్లాడుతూ "కాశ్మీర్‌లో శాంతి కోసం మా హృదయపూర్వక విజ్ఞప్తి అని,  భారతదేశం మరియు పాకిస్తాన్‌లలో  మాత్రమే కాకుండా ప్రపంచ శాంతికి అందరు కృషి చేయాలనీ అన్నారు.

 

Article and design  by

 M kranthi Swaroop