గాజా కోసం పోప్ లియో XIV విజ్ఞప్తి : సహాయాన్ని అనుమతించండి, శత్రుత్వాలను అంతం చేయండి

గాజా కోసం పోప్ లియో XIV విజ్ఞప్తి : సహాయాన్ని అనుమతించండి, శత్రుత్వాలను అంతం చేయండి
గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని ముగించాలని మరియు "తగినంత మానవతా సహాయం" అందించాలని పోప్ లియో XIV పిలుపునిచ్చారు. "గాజా స్ట్రిప్‌లో పరిస్థితి ఆందోళనకరంగా మరియు బాధాకరంగా మారుతోంది" అని పోప్ లియో XIV అన్నారు.
యుద్ధంలో దెబ్బతిన్న గాజాలోకి తగినంత మానవతా సహాయం అనుమతించాలని పోప్ లియో XIV బుధవారం పిలుపునిచ్చారు. గాజా లో తీవ్రమైన ఆహారం మరియు ఔషధ కొరతకు దారితీసిందని మానవతా సంస్థలు చెబుతున్నాయి.
"గాజా స్ట్రిప్‌లో పరిస్థితి ఆందోళనకరంగా మరియు బాధాకరంగా ఉంది" అని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో తన మొదటి వారపు సాధారణ సమావేశంలో పోప్ లియో XIV గారు అన్నారు. "తగినంత మానవతా సహాయం చేయడానికి అనుమతించాలని మరియు శత్రుత్వాలను అంతం చేయాలని నా హృదయపూర్వక విజ్ఞప్తి అని అన్నారు , ఈ సైనిక చర్య వల్ల పిల్లలు, వృద్ధులు, రోగులు ఎక్కువ మూల్యం చెల్లిస్తున్నారు అని పోప్ లియో XIV గారు అన్నారు.
అంతర్జాతీయ సంస్థల ప్రకారం, గాజాలో మానవతా అత్యవసర పరిస్థితి తీవ్ర సంక్షోభంలో ఉంది. ఐక్యరాజ్యసమితి మద్దతు ఇచ్చిన ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ (IPC) గాజా లో ఏర్పడుతున్న కరువు గురించి హెచ్చరిస్తోంది.
అమెరికా మరియు ఇతర మిత్రదేశాల నుండి భారీ ఒత్తిడితో ఇజ్రాయెల్ ఈ వారం గాజాలోకి మరిన్ని సహాయాన్ని అనుమతించడం ప్రారంభించింది . కానీ అది ఇజ్రాయెల్ తన సైనిక చర్యను తగ్గించలేదు. సహాయక సంస్థలు అందించే సహాయం దెబ్బతిన్న పౌర జనాభా యొక్క అత్యవసర అవసరాలను తీర్చడానికి ఎక్కడా సరిపోదని చెబుతున్నాయి.
మార్చి 2న ఇజ్రాయెల్ పూర్తి దిగ్బంధనం విధించిన తర్వాత మొదటిసారిగా సహాయం పంపడానికి అనుమతి లభించిందని ఐక్యరాజ్యసమితి సోమవారం ప్రకటించింది. ఇజ్రాయెల్ గాజాలోకి పరిమిత సంఖ్యలో సహాయ ట్రక్కులను అనుమతించినప్పటికీ, అంతర్జాతీయంగా విమర్శలు పెరిగాయి.
Article and design by M kranthi swaroop