విశాఖపురి మేరీమాత పుణ్యక్షేత్రం నందు సంగీత తరగతులు

విశాఖపురి మేరీమాత పుణ్యక్షేత్రం నందు సంగీత తరగతులు  

"సంగీతం దేవుడిని మహిమపరచడానికే"... సంగీతం దేవునితో మన సంబంధాన్ని బలోపేతం చేస్తుంది అలానే బాధపడే విశ్వాసులకు సంగీతం ఓదార్పునిస్తుంది మరియు దేవునివైపు నడిపిస్తుంది.

విశాఖ అతిమేత్రాసనం, విశాఖపురి మేరీమాత పుణ్యక్షేత్రం నందు సంగీత తరగతులు పుణ్య క్షేత్ర డైరెక్టర్ ఫాదర్  శ్రీ కొండాల జోసఫ్ గారి పర్యవేక్షణలో జరుగుతున్నాయి.

ఈ సంగీత తరగతులు గత సంవత్సరం (2024) నుండి ప్రారంభం అయినవి. దీనికి ఫాదర్ హరిష్ గారి నేతృత్వంలో కీబోర్డ్ (Keyboard), గిటార్ (Guitar), Vocal  , Action Songs, Dance, పిల్లలకు నేర్పబడుతున్నాయి.

విశాఖ అతి మేత్రాసనములోని వివిధ విచారణల నుండి బాల బాలికలు ఎంతో మంది ఈ సంగీత తరగతులలో పాల్గొంటున్నారు. సంగీతంలో అనుభవజ్ఞులు అయిన  కసిరెడ్డి చిన్నారావు మాష్టారు, సిస్టర్ ఎడ్విన్ గారు,ఇందాన తోమాసు గారు,గిరి గారు, పిల్లలకు సరైన శిక్షణ   అందిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 9 నుండి సాయింత్రం 4 వరకు క్లాస్ లు జరుగుతున్నాయి.

శ్రీ కసిరెడ్డి చిన్నారావు గారు మాట్లాడుతూ "సంగీతం నేర్చుకోవడం పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది అని , సంగీతం పిల్లలలో సృజనాత్మకతను పెంచడానికి మరియు వారి భావాలను వ్యక్తీకరించడానికి సహాయపడుతుంది" అని అన్నారు.

 విశాఖ అతి మేత్రాసన MSFS, ఫాదర్స్ చేస్తున్న సేవ అమోఘం అని, ఉచిత తరగతులు నిర్వాహణ, మధ్యహ్న భోజన సదుపాయాలతో ఎంతోమంది  మనసులను ఆకర్షిస్తున్నారు అని పిల్లల తల్లిదండ్రులు తెలిపారు .

Article By  M Kranthi Swaroop