కలకత్తాలోని నితికా డాన్ బాస్కోలో బెంగాలీ భాషలో 2022లో ప్రారంభమైన ఉపదేశుల ప్రాథమిక శిక్షణ ఏప్రిల్ 24, 2024న, డార్జిలింగ్‌లోని సొనాడ, సలేసియన్ కాలేజ్ లో, ముగిసింది.
బెంగాలీ, హిందీ, సంథాలీ మరియు నేపాలీ భాషలలో శిక్షణ ప్రారంభించారు.
రెండు సంవత్సరాల ప్రాథమిక శిక్షణ (BTC) నేపాలీలో రెండవ దశ శిక్షణతో ఏప్రిల్ 24, 2024న ముగిసింది.
నేపాలీ రెండవ దశ శిక్షణలో డార్జిలింగ్ మరియు సిక్కిం ప్రాంతాల నుండి 28 మంది ఉపదేశులు పాల్గొన్నారు.
వారు తమ శిక్షణను ఏప్రిల్ 21న ప్రారంభించి ఏప్రిల్ 24న ముగించారు.
జాతీయ ఉపదేశుల డైరెక్టర్ గురుశ్రీ కుముదా దిగాల్,దక్షిణ ఆసియా యూత్ డైరెక్టర్ గురుశ్రీ పాట్రిక్ లెప్చా మరియు గురుశ్రీ పవన్జిత్ సింగ్ గార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
డార్జిలింగ్ మేత్రాసనానికి చెందిన సలేసియన్ గురువులు మరియు మేత్రాసన గురువులు రిసోర్స్ పర్సన్లుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు.
డార్జిలింగ్-సిక్కిం మేత్రానులు మహా పూజ్య స్టీఫెన్ లెప్చా గారు శిక్షణ తీసుకున్న వారిని అభినందించి ప్రోత్సహించారు.