సెయింట్ ఆగ్నెస్ పండుగ | పోప్ లియో XIV కు గొర్రె పిల్లలను బహూకరించారు

సెయింట్ ఆగ్నెస్ పండుగ | పోప్ లియో XIV కు గొర్రె పిల్లలను బహూకరించారు

జనవరి 21న, వాటికన్‌లోని అర్బన్ VIII చాపెల్‌లో, సెయింట్ ఆగ్నెస్ జ్ఞాపకార్థం పరిశుద్ధ పోప్ లియో XIV గారికి రెండు గొర్రె పిల్లలను బహూకరించారు. పురాతన సంప్రదాయాన్ని అనుసరించి, ఆ గొర్రె పిల్లలను ఉత్తర రోమ్‌లోని గోడల వెలుపల సెయింట్ ఆగ్నెస్ బసిలికాలో ఆశీర్వదించారు.ఆచారం ప్రకారం, ఈ గొర్రె పిల్లల నుండి వచ్చే ఉన్ని కొత్త మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్‌ల కోసం పాలియంను తయారు చేయడానికి ఉపయోగించబడుతుంది.

సెయింట్ ఆగ్నెస్ పండుగ సందర్భంగా రెండు గొర్రె పిల్లలను ఆశీర్వదించే సంప్రదాయం గురించి మొదటి ప్రస్తావన 6వ శతాబ్దానికి చెందినది. ఆమె జీవితం గురించిన ఒక పురాతన పురాణగాథతో ఇది ముడిపడి ఉంది, ఆమె మరణం తర్వాత ఆమె తల్లిదండ్రులు ఆమె సమాధి వద్ద ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఆమె వారికి కనిపించిందని చెపుతుంటారు. వారు ఆమెను కన్యల బృందం చుట్టూ ఉండగా, ఆమె చేతుల్లో స్వచ్ఛమైన గొర్రెపిల్లను పట్టుకుని ఉండటం చూశారు.

అనేక శతాబ్దాలుగా, దక్షిణ రోమ్‌లోని అబ్బే ఆఫ్ ది త్రీ ఫౌంటెన్స్‌లో ఉన్న ట్రాపిస్ట్ ఫామ్ నుండి గొర్రె పిల్లలను సెయింట్ ఆగ్నెస్ బసిలికా నుండి నేరుగా పోప్ వద్దకు ఆశీర్వదించడానికి తీసుకెళ్లేవారు.  

తరువాత గొర్రె పిల్లలను ట్రాస్టెవెరెలోని సెయింట్ సిసిలియా బసిలికాలోని బెనెడిక్టైన్ సన్యాసినుల వద్దకు పంపుతారు, వారు పవిత్ర వారంలో వాటిఉన్నిని కత్తిరించి, కొత్త ఆర్చ్ బిషప్‌ల కోసం ఉన్నిని పల్లియాలో నేయడానికి వీలుగా ఉండేలా చేస్తారు.

Article and design by

M kranthi Swaroop