Czech Republic అధ్యక్షుడితో సమావేశమైన పోప్

సోమవారం జనవరి 19 ఉదయం వాటికన్‌లో Czech Republic అధ్యక్షుడు పీటర్ పావెల్‌ను పోప్ కలిసారు

పోప్ తో సమావేశం అనంతరం అధ్యక్షుడు పీటర్ హోలీ సీ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియాట్రో పరోలిన్ మరియు దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థలతో సంబంధాల కార్యదర్శి ఆర్చ్‌బిషప్ పాల్ రిచర్డ్ తో సమావేశమైనట్లు హోలీ సీ ప్రెస్ కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

వాటికన్ విదేశాంగ కార్యాలయంలో జరిగిన స్నేహపూర్వక చర్చలలో భాగంగా  హోలీ సీ మరియు చెక్ రిపబ్లిక్ మధ్య ఉన్న దౌత్య సంబంధాలపై ప్రశంసలు పునరుద్ఘాటించబడ్డాయి మరియు వాటిని మరింత బలోపేతం చేయాలనే సంకల్పించుకునట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రాంతీయ, అంతర్జాతీయ స్వభావం గల అనేక సామాజిక-రాజకీయ విషయాలపై వారు దృష్టి సారించారని, ముఖ్యంగా కొనసాగుతున్న సంఘర్షణలపై ప్రత్యేక శ్రద్ధ వహించారని, 

"శాంతి కోసం తక్షణ నిబద్ధత ప్రాముఖ్యతను, అంతర్జాతీయ సమస్యలు పై శాంతి చర్చలు అవసరమని ఆ ప్రకటన పేర్కొంది.