సెప్టెంబరులో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి అపోస్టోలిక్ సందర్శన కోసం ఎదురుచూస్తున్న పాపువా న్యూ గినియా (PNG)లోని ఒక పట్టణంలోని కథోలికులు మరియు పౌర సమాజ సభ్యులు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని ప్రత్యక్షంగా చూసే అవకాశం పట్ల ఎనలేని సంతోషాన్ని వ్యక్తం చేశారని శ్రీసభకు చెందిన ఒక గురువు చెప్పారు.
విశాఖ అతిమేత్రాసనం, ఎర్ర సామంతవలస గిరిజన విచారణలో సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ స్వస్థత ప్రార్థన కూటమి భక్తియుతంగా జరిగింది. ఈ ప్రార్థన కూటమి సోమవారం రాత్రి పనసబద్ర నూతన దేవాలయం లో రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు జరిగింది.
విశాఖ అతిమేత్రాసనంలో ఆగస్టు 10, శనివారం ఉదయం 10.30 గంటలకు గాంధీ విగ్రహం, జీవీఎంసీ వద్ద దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కొరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
తమిళనాడులోని వైలంకన్నిలోని "అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్" (వెళాంగిణిమాత పుణ్యక్షేత్రం) బాసిలికాకు వేలాది మంది హిందువులు మరియు ముస్లింలు తీర్థయాత్ర చేయడం దేవుని ప్రేమకు సంకేతం అని, ఆందోళనకు కారణం కాదని కార్డినల్ మహా పూజ్య ఫెర్నాండెజ్ గారు అన్నారు