భక్తియుతంగా ఉపవాస ప్రార్థన కూటమి | బ్రదర్ సత్యం

భక్తియుతంగా ఉపవాస ప్రార్థన  కూటమి 

ఏలూరు మేత్రాసనం , దుర్భగూడెం గురుమండలము లోని పునీత పేతురు - పునీత పౌలు విచారణలో రెండవ శనివారం ఉపవాస ప్రార్థన  కూటమిని నిర్వహించారు. విచారణకర్తలు  ఫాదర్ అంతయ్య గారి ఆధ్వర్యంలో ఈ ప్రార్థన  కూటమి భక్తియుతంగా జరిగింది. 

శనివారం జరిగిన ఉపవాస ప్రార్థనలను బ్రదర్ సత్యం వాడపల్లి గారు నిర్వహించారు. ఈ ప్రార్థన కూటమి లో అధిక సంఖ్యలో విశ్వాసులు, విచారణ ప్రజలు పాల్గొన్నారు. బ్రదర్ సత్యం వాడపల్లి గారు  దైవ సందేశాన్ని అందించి  విశ్వాసులను ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకువెళ్లారు. 

ఆధ్యాత్మిక క్రమశిక్షణ కొరకు ఉపవాస ప్రార్థన అవసరం ఎంతో ఉందని బ్రదర్ సత్యం వాడపల్లి గారు అన్నారు. బ్రదర్ సత్యం వాడపల్లి గారు మాట్లాడుతూ "ఈ రోజు, మీరు మీ జీవితంలో ఇరుకైన మార్గాలను ఎదుర్కొంటూ ఉండవచ్చును, దేవుని యందు నమ్మకంగా , ప్రభూమార్గంలో జీవిస్తూ ,నిలబడితే ఆ దేవాది దేవుడు ఉన్నత స్థానంలో మిమ్మలని ఉంచుతారు"  అని అన్నారు.
 
విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు. విచారణ ప్రజలు ,సిస్టర్స్,  ఉపదేసులు, లీజన్ మేరీ  సభ్యులు, యూత్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సహాయ సహకారాలను అందించారు.

 

Article and Design By M Kranthi Swaroop