యుద్ధ బాధితుల కొరకు ప్రార్దించిన పోప్

బుధవారం సెప్టెంబర్ 10 న సామాన్య ప్రేక్షకుల సమావేశయంలో పోప్ లియో పాల్గొన్నారు 

యుద్ధంతో నలిగిపోయిన ప్రదేశాలలో ముక్యంగా  ఉక్రెయిన్, గాజా మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో  బాధపడుతున్న పిల్లల కొరకు ప్రత్యేకంగా ప్రార్ధించమని పోప్ లియో పిలుపునిచ్చారు

పోలిష్ యాత్రికులతో మాట్లాడుతూ, వారి జాతీయ యుద్ధ బాధితుల దినోత్సవాన్ని గుర్తుచేసుకున్నారు, ఇది పిల్లల బాధలను మరియు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పోలాండ్ పునర్నిర్మాణానికి వారి సహకారాన్ని గుర్తుచేస్తుంది.

అరబిక్ మాట్లాడే విశ్వాసులను పలకరిస్తూ, మధ్యప్రాచ్యంలో అల్లకల్లోల పరిస్థితిని సహిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్ధించారు.

కష్టాల క్షణాల్లో ఆ దేవుని పై నమ్మకం ఉంచి దానిని ప్రార్థనగా మార్చమని పోప్ విశ్వాసులను ఆహ్వానించారు

ఆ దేవుడు మీ అందరినీ ఆశీర్వదిస్తాడు,ఎల్లప్పుడు ప్రతి చెడు నుండి మిమ్మల్ని రక్షిస్తాడు!” అని పోప్ ముగ్గించారు