అమృతవాణి ని సందర్శించిన మహా పూజ్య డా. జయరావు పొలిమేర గారు

అమృతవాణి ని సందర్శించిన మహా పూజ్య డా. జయరావు పొలిమేర గారు
అమృతవాణి సమాచార కేంద్రాన్ని అమృతవాణి అధ్యక్షులు మహా పూజ్య డా. జయరావు పొలిమేర గారు సందర్శించారు.
మహా పూజ్య డా. జయరావు పొలిమేర గారు ఏళ్లతరబడి పెండింగ్లో ఉన్న కోర్ట్ కేసులను పరిష్కరించే మార్గాలను చూపిస్తూ తగు చర్యలను తీసుకున్నారు. ఈ సమావేశం లో టీసీబీసీ డిప్యూటీ సెక్రటరీ ఫాదర్ రాజు అలెక్స్ గారు పాల్గొని న్యాయపరమైన సూచనలు చేసారు. దివ్యవాణి టీవీ సీఈఓ ఫాదర్ లూర్దురాజు గారు, అమృతవని డైరెక్టర్ ఫాదర్ సుధాకర్ పప్పుల గారు, ఫాదర్ క్రిష్టఫర్ గారు, ఫాదర్ చిన్నప్ప గార్లు మరియు అమృతవాణి సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అమృతవాణి బిల్డింగ్ ను పరిశీలించిన మహా పూజ్య డా. జయరావు పొలిమేర గారు అమృతవాణి భవనానికి చేయాల్సిన మార్పులను సూచించారు.
Article and design By M kranthi Swaroop