లిథువేనియా రిపబ్లిక్ అధ్యక్షుడితో సమావేశమైన పోప్ లియో

సోమవారం అక్టోబర్ 6 న లిథువేనియా రిపబ్లిక్ అధ్యక్షుడు Gitanas Nausėda పోప్ లియో తో సమావేశమయ్యారు.

పోప్‌తో సమావేశమైన తరువాత అధ్యక్షుడు Gitanas హోలీ సీ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్‌ మరియు రాష్ట్రాలు మరియు అంతర్జాతీయ సంస్థలతో సంబంధాల కార్యదర్శి ఆర్చిబిషప్ పౌల్ రిచర్డ్ ను కలిసినట్లు హోలీ సీ ప్రెస్ ఆఫీస్ పేర్కొంది

సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్‌లో జరిగిన సమావేశంలో, రెండు పార్టీలు అనగా హోలీ సీ మరియు లిథువేనియా మధ్య మంచి సంబంధాల" పట్ల సంతృప్తి వ్యక్తం చేశాయని హోలీ సీ ప్రెస్ ఆఫీస్ తెలిపింది.

ఉక్రెయిన్‌లో యుద్ధం మరియు అనేక అంతర్జాతీయ సమస్యల గురించి వారు చర్చించారు 

భయంకరమైన పరిణామాలకు దారితీసే వివాదం పెరిగే ప్రమాదాన్ని నివారించడానికి దౌత్యపరమైన పరిష్కారాల కోసం అన్వేషణను తీవ్రతరం చేయవలసిన అవసరాన్ని వారు ప్రస్తావించారు అని హోలీ సీ ప్రెస్ ఆఫీస్ పేర్కొంది