చార్లీ కిర్క్ హత్యను తీవ్రంగా ఖండించిన కార్డినల్ పియట్రో పరోలిన్

చార్లీ కిర్క్ హత్యను తీవ్రంగా ఖండించిన కార్డినల్ పియట్రో పరోలిన్
వాటికన్ విదేశాంగ కార్యదర్శి, మహా ఘన కార్డినల్ పియట్రో పరోలిన్ గారు క్రైస్తవ సంప్రదాయవాద కార్యకర్త చార్లీ కిర్క్ హత్యను తీవ్రంగా ఖండించారు. విభిన్న విశ్వాసాలు కలిగిన వారిపై జరిగే ప్రతి హింసాకాండ జాతీయ మరియు అంతర్జాతీయ సమాజాలను బెదిరిస్తుందని నొక్కి చెప్పారు. వాటికన్‌లో జర్నలిస్టులతో మాట్లాడుతూ, మహా ఘన కార్డినల్ పరోలిన్ గారు శ్రీసభ వైఖరిని పునరుద్ఘాటిస్తూ "మేము అన్ని రకాల హింసకు వ్యతిరేకం అని అన్నారు.
సెప్టెంబర్ 10న ఉటాలోని ఒరెమ్‌లోని ఉటా వ్యాలీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో సంప్రదాయవాద కార్యకర్త చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు. బహిరంగ సమావేశం లో చార్లీ కిర్క్ ఒక వ్యక్తితో చర్చిస్తున్నప్పుడు, ఒకే ఒక్క కాల్పుల శబ్దం వినిపించింది, అది కిర్క్‌ను తాకింది(మెడపై) వెంటనే అయన కుప్పకూలిపోయారు. విశ్వవిద్యాలయ క్యాంపస్ భవనం నుండి ఒక స్నైపర్ అతని మెడపై కాల్పులు జరిపినట్లు సమాచారం. నిందితుడు పరారీలో ఉన్నాడు.
స్వేచ్ఛా వాక్ స్వాతంత్య్రాన్ని సమర్థించడంలో మరియు క్రైస్తవులు మరియు సాంప్రదాయిక విలువల తరపున చార్లీ కిర్క్ తన గళాన్ని వినిపించేవారు. కిర్క్ వయస్సు 31 సంవత్సరాలు మరియు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటనలో, తన సంతాపాన్ని ప్రకటిస్తూ "గొప్ప వ్యక్తి, లెజండరీ చార్లీ కిర్క్ ఇక లేరు" అని సోషల్ మీడియా పోస్టులో రాశారు.
సాల్ట్ లేక్ సిటీ పీఠాధిపతులు మహా పూజ్య ఆస్కార్ ఎ. సోలిస్ గారు OSV న్యూస్‌తో మాట్లాడుతూ “ చార్లీ కిర్క్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు" " అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాను" అని బిషప్ సోలిస్ గారు అన్నారు.
TPUSA -"టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ" (Turning Point USA) అనేది ఉన్నత పాఠశాల, కళాశాల మరియు విశ్వవిద్యాలయ ప్రాంగణాలలో సంప్రదాయవాద రాజకీయాలను ప్రోత్సహించే ఒక అమెరికన్ లాభాపేక్ష లేని సంస్థ.
Article and Design By M kranthi Swaroop