పాకిస్తాన్: అత్యంత దారుణమైన వరదలకు సహాయం అందిస్తున్న కతోలిక సంస్థలు

పాకిస్తాన్: అత్యంత దారుణమైన వరదలకు సహాయం అందిస్తున్న కతోలిక సంస్థలు
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్(province)లో దాదాపు 40 ఏళ్లలో తొలిసారిగా వరదలు నగరంలోకి ప్రవేశించడంతో లాహోర్‌లోని అనేక నివాస ప్రాంతాలు నీట మునిగిపోయాయి. కర్తార్‌పూర్‌లోని ఒక గురుద్వారా (సిక్కు దేవాలయం)తో సహా రాష్ట్రమంతటా కనీసం 1,700 గ్రామాలు మునిగిపోయాయి.
పాకిస్తాన్‌లోని కతోలిక సంస్థలు తన సహాయాన్ని ముమ్మరం చేసాయి. కారిటాస్ పాకిస్థాన్ ఆధ్వర్యంలో లాహోర్‌కు దక్షిణంగా ఉన్న భాయ్ ఫెరు(Bhai Pheru )లో వరద బాధిత కుటుంబాలకు ఫాదర్ ఖైజర్ ఫిరోజ్, OFM Cap, మరియు అతని బృంద సభ్యులు ఆహార సహాయం అందించారు. వరద ప్రాంతాలను సందర్శించి బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు.
ఫాదర్ ఖైజర్ ఫిరోజ్, OFM Cap, గారు మాట్లాడుతూ "ఈ పరిస్థితి చాలా తీవ్రమైనది మరియు భయంకరమైనది. కుటుంబాలు ఇళ్ళు, భూమి మరియు జీవనోపాధిని కోల్పోయాయి. లాహోర్‌కు దక్షిణంగా ఉన్న మా విచారణ భాయ్ ఫెరు(Bhai Pheru )లో 32 కుటుంబాలకు ఆహారం, నిత్యావసర వస్తువులు అందించాము అని అన్నారు. ఇతర నిరాశరులైన వారికొరకు సహాయం అందిస్తున్నామని తెలిపారు.
ఇటీవలి కురిసిన వర్షాలు ,సరిహద్దు అవతల నుండి నీటిని విడుదల చేయడం వల్ల సట్లెజ్, రావి మరియు చీనాబ్ నదులు పొంగి పొర్లాయి .దాదాపు 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, వీరిలో 200 మందికి పైగా పిల్లలు ఉన్నారు.
తాము కూడా ప్రభావితమైనప్పటికీ, క్రైస్తవ సంఘాలు, సంస్థలతో కలసి వివిధ ప్రాంతాలలో సహాయాన్ని అందిస్తున్నామని. రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం ఐనప్పటికీ ఆహారం, మందులు పంపిణీ చేస్తున్నామని ఫాదర్ ఖైజర్ ఫిరోజ్, OFM Cap, గారు అన్నారు.
Article and Design By M kranthi swaroop