విశాఖ అతిమేత్రాసనం వేళాంగణి మాత దేవాలయం, కైలాసపురం విచారణలో తపస్సు కాల పాప పరిహార పశ్చాత్తాప ఉపవాస ప్రార్థనా కూడిక భక్తిశ్రద్ధలతో జరిగింది. విచారణ కర్తలు గురుశ్రీ సంతోష్ CMF గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
హైదరాబాద్ అతిమేత్రాసనం పునీత జోజప్ప గారి దేవాలయం, బొల్లారం విచారణలో తపస్సు కాల ప్రత్యేక దివ్య బలిపూజ భక్తిశ్రద్ధలతో జరిగింది. విచారణ కర్తలు గురుశ్రీ వేలంటైన్ డిమెల్లో గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఉత్తర ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లా కోర్టు మార్చి 12న లక్నో డియోసెస్కు చెందిన గురువు గురుశ్రీ డొమినిక్ పింటోతో పాటు మరో 10 మంది ప్రొటెస్టెంట్స్ సహోదరులు కి బెయిల్ మంజూరు చేసింది.
ఆంధ్ర, తెలంగాణ కథోలిక శ్రీసభకు ఎనలేని సేవలు అందించిన అమృతవాణి సికిందరాబాదు లో ఉంది. అక్కడి అమృతవాణి భవనాన్ని నిర్మించి అమృతవాణి కార్యాలయంగా ప్రారంభించి 50 వ సంవత్సరం సందర్భంగా జూబిలీ చిహ్నాన్ని ప్రారంభించారు.
విశాఖ అతిమేత్రాసనం వేళాంగణి మాత దేవాలయం, కైలాసపురం విచారణలో పాప పశ్చాత్తాప పాద యాత్ర" భక్తియుతంగా జరిగింది. శనివారం ఉ|| 5 గం||లకు వేళాంగణి మాత దేవాలయం నుండి మేరీమాత కొండ గుడి వరకు ఈ పాప పశ్చాత్తాప పాద యాత్ర నిర్వహించారు.