తపస్సు కాల పాప పరిహార పశ్చాత్తాప ఉపవాస ప్రార్థనా కూడిక

తపస్సు కాల పాప పరిహార పశ్చాత్తాప ఉపవాస ప్రార్థనా కూడిక

విశాఖ అతిమేత్రాసనం వేళాంగణి మాత దేవాలయం, కైలాసపురం విచారణలో తపస్సు కాల పాప పరిహార పశ్చాత్తాప ఉపవాస ప్రార్థనా కూడిక భక్తిశ్రద్ధలతో జరిగింది. విచారణ కర్తలు  గురుశ్రీ సంతోష్ CMF గారి  ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

తపస్సు కాలం ఐదవ ఆదివారం అనగా  17  మార్చి ఉదయం 9:00  గంటల  నుండి సాయంత్రం   4:00గం వరకు పాప పరిహార పశ్చాత్తాప ఉపవాస ప్రార్థనా కూడిక ను నిర్వహించారు. గురుశ్రీ   మరియదాస్ , డైరెక్టర్, డివైన్ మెర్సీ రిట్రీట్ సెంటర్ కంటకాపల్లి వారు పాల్గొని అమూల్యమైన దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు.

గురుశ్రీ సంతోష్ గారు ఈ శ్రమదినాలలో విశ్వాసులు ఆధ్యాత్మికంగా ముందుకు నడిచేలా  వారి కొరకు ప్రత్యక ప్రార్థన  కార్యక్రమాలను ఏర్పాటు చేసారు.  విచారణ  సహాయక గురువులు గురుశ్రీ జాన్ CMF, గారు తన సహాయసహకారాలు అందించారు.

విచారణ ప్రజలను ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తున్న గురుశ్రీ సంతోష్ గారిని ఆ దేవాది దేవుడు దీవించాలని కోరుకుంటూ మీ అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer