గురుశ్రీ డొమినిక్ పింటోతో పాటు మరో 10 మందికి బెయిల్

ఉత్తర ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా కోర్టు మార్చి 12న లక్నో డియోసెస్‌కు చెందిన గురువు గురుశ్రీ డొమినిక్ పింటోతో పాటు మరో 10 మంది ప్రొటెస్టెంట్స్ సహోదరులు కి బెయిల్ మంజూరు చేసింది.

ఒక నెల రోజుల క్రితం ఉత్తర భారత రాష్ట్రంలో కఠినమైన మతమార్పిడి నిరోధక చట్టం కింద వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు గురైన విషయం మనకు తెలిసినదే.

"గురుశ్రీ పింటో మరియు అతనితో అరెస్టయిన వారందరికీ జిల్లా న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేసారు" అని లక్నో పీఠాధిపతులు మహా పూజ్య గెరాల్డ్ జాన్ మథియాస్ గారు చెప్పారు.

మహా పూజ్య గెరాల్డ్ జాన్ మథియాస్ గారు మాట్లాడుతూ "విశ్వాసుల ప్రార్థనలు ఫలించాయని బెయిల్ మంజూరు కావాలని ప్రార్ధించిన, సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేసారు .

సాధారణ ప్రార్థన సేవను సామూహిక మత మార్పిడి చర్యగా చిత్రీకరించిన ఒక మితవాద హిందూ కార్యకర్త బ్రిజేష్ కుమార్ వైశ్య పిర్యాదు చేయడంతో బారాబంకి జిల్లాలోని దేవా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది, ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఫిబ్రవరి 5న వీరందరిని అరెస్టు చేశారు.

ఇది "పూర్తిగా కల్పిత కేసు" అని మేత్రాసన ఛాన్సలర్ మరియు ప్రతినిధి గురుశ్రీ డొనాల్డ్ డిసౌజా గారు అన్నారు.అయితే బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు విధించిన షరతులను ఛాన్సలర్ వెల్లడించలేదు.

మధ్యప్రదేశ్‌లో కూడా మతమార్పిడి నిరోధక చట్టం ఉంది, ఇది క్రైస్తవులను వేధించడానికి ఉపయోగించబడుతుందని క్రైస్తవ నాయకులు అంటున్నారు.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer