మహిమకరంగా జరిగిన ఏలూరు యునైటెడ్ క్రిస్మస్
మహిమకరంగా జరిగిన ఏలూరు యునైటెడ్ క్రిస్మస్
ఏలూరు లో సెయింట్ జేవియర్ స్కూల్ గ్రౌండ్స్ లో, డిసెంబర్ 3న యునైటెడ్ క్రిస్మస్ ఘనంగా జరిగింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం మొదలైనది. ఏలూరు సిటీ పాస్టర్స్ ఫెల్లోషిప్ (ECPF) వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏలూరు పీఠాకాపరి మరియు విశాఖ అతిమేత్రాసన అపోస్తలిక పాలనాధికారి మహా పూజ్య డా|| పొలిమెర జయరావు గారు పాల్గొన్నారు. మహా పూజ్య డా|| పొలిమెర జయరావు గారు క్రిస్మస్ గ్రీటింగ్స్ మరియు క్రిస్మస్ సందేశాన్ని ప్రజలకు అందించారు. ఇతర గురువులు , పాస్టర్లు తో కలసి క్రిస్మస్ కాండిల్ లైట్ సర్వీస్ మరియు క్రిస్మస్ కేక్ కటింగ్ చేసారు.
వేలాదిగా తరలి వచ్చిన క్రైస్తవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ జ్యోతి రాజు గారు, పాస్టర్ N మైఖేల్ పాల్ గారు మరియు అధికసంఖ్యలో పాస్టర్లు, గురువులు పాల్గొన్నారు. ఏలూరు సిటీ పాస్టర్స్ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక క్రిస్మస్ సందేశకులుగా దైవజనులు Dr. N. జయపాల్ గారు పాల్గొని అమూల్యమైన దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు. వేలాదిగా తరలి వచ్చిన క్రైస్తవుల మధ్య కన్నుల పండుగగా ఈ వేడుకలు జరిగాయి.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer