జపమాల మాసాన్ని ఘనంగా జరుపుకున్న గ్వానెల్ల కరుణాలయ బాలురు
జపమాల మాసాన్ని ఘనంగా జరుపుకున్న గ్వానెల్ల కరుణాలయ బాలురు
ఏలూరుకు మేత్రాసనంలోని వట్లూరులోని "గ్వానెల్ల కరుణాలయ"(Guanella Karunalaya) లోని బాలురు జపమాల మాసాన్ని ఘనంగా కొనియాడారు. విచారణ విశ్వాసులతో కలిసి జపమాల మాసాన్ని జరుపుకున్నారు. బాలుర గృహం డైరెక్టర్ ఫాదర్ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
జపమాలలోని ప్రతి రహస్యాన్ని బాలురు స్టిల్ ఇమేజ్ శైలిలో ప్రదర్శించారు మరియు ప్రతి రహస్యానికి సంబంధించిన సువార్త భాగాన్ని పిల్లలే చదివి వినిపించారు. ఆద్యంతం భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమం జరిగింది. సహాయక గురువులు ఫాదర్ రాజా రత్నం గారు తన సహాయని అందించారు.
ఏలూరుకు మేత్రాసనంలోని వట్లూరులో గ్వానెల్లియన్ ఫాదర్స్ నిర్వహిస్తున్న బాలుర గృహం "గ్వానెల్ల కరుణాలయ". ఈ బాలుర గృహం అనాథలు మరియు అవసరంలో ఉన్న అబ్బాయిలకు సంరక్షణ, విద్య మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. సెయింట్ లూయిస్ గ్వానెల్లా స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ఛారిటీలోభాగమైన గ్వానెలియన్ ఫాదర్స్ దీనిని నిర్వహిస్తున్నారు.
Article by M Kranthi Swaroop