ప్రభు యేసుని ప్రేమను చాటిన బొబ్బిలి విశ్వాసులు

ప్రభు యేసుని ప్రేమను చాటిన బొబ్బిలి విశ్వాసులు 

క్రిస్మస్ ప్రేమకు ప్రతిరూపం అని బొబ్బిలి అరుణమ్మ అన్నారు.  దేవునికి  ఎన్నో అద్భుతమైన లక్షణాలు ఉన్నప్పటికీ వాటన్నిటిలో ముఖ్యమైన లక్షణం ప్రేమే అని, ఆయన ప్రేమకు ప్రతిరూపం అని అరుణమ్మ గారు అన్నారు.  

విశాఖ అగ్రపీఠం, బొబ్బిలిలోని  పునీత జోజప్ప గారి విచారణ విశ్వాసులు ప్రభు యేసుని ప్రేమని చాటారు. క్రిస్మస్ సందర్భముగా పేదవారికి రగ్గులు (దుప్పట్లు) మరియు పండ్లు  ఉచితంగా ఇవ్వడం జరిగింది. బొబ్బిలి విచారణ కర్తలు ఫాదర్ అరుళ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 

బొబ్బిలి లో ఉన్న హ్యాండ్ టూ హ్యాండ్ మరియు  కుష్ఠురోగుల హాస్పిటల్  లను సందర్శించి వారికీ సహాయం చేసారు. ఈ శీతాకాలం లో విపరీతమైన చలికి ఇబ్బందిపడుతున్న రోడ్ల మీద  ఉన్న పేదవారికి వారికీ రగ్గులు (దుప్పట్లు) అందజేశారు. ఈ కార్యక్రమంలో సిస్టర్ జోజి రోసి గారు ,సిస్టర్ స్మిత గారు,శ్రీ  వెంకట్ గారు ,మేరీ పుష్ప గారు , అరుణమ్మ గారు ,సుధారాణి గారు , కృష్ణ వేణి గారు , హృదయాజాలి గారు , ధనుశ్రీ గారు మరియు ఇతర విచారణ ప్రజలు పాల్గొన్నారు. విచారణ  సహాయక గురువులు ఫాదర్ వేలాంగణి తన సహాయసహకారాలు అందించారు.     

Article and Design By M. Kranthi Swaroop