చైనా కొత్తరకం న్యూమోనియా కేసులపై కేంద్రం హెచ్చరిక

చైనా కొత్తరకం న్యూమోనియా కేసులపై కేంద్రం హెచ్చరిక

కోవిడ్ మహమ్మారి తరువాత చైనా అంటేనే ప్రపంచమంతా భయపడుతుంది. తాజాగా చైనా లో పిల్లలలో న్యుమోనియా (శ్వాసకోశ సంబంధిత) కేసులు ఎక్కువవుతున్నాయి అని  తెలిసి  ప్రపంచమంతా ఉలిక్కిపడుతోంది.  ఇందుకు సంబంధించి భారత్‌లోనూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అయితే నమోదైన న్యూమోనియా కేసులలో కొత్తగా అసాధారణ వ్యాధికారకాలను కనుగొనలేదని డబ్ల్యుహెచ్ఓ వెల్లడించింది. 2019లో వెలుగుచూసిన కరోనా వైరస్, ఇప్పుడు కొత్తరకం న్యూమోనియాకు దగ్గర పోలికలు ఉన్నాయి.

బీజింగ్‌లోని చిన్నపిల్లల ఆస్ప్రతికి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ ఆస్పత్రుల సామర్థ్యానికి మించి పేషెంట్లు వస్తున్నారని, సగటున రోజుకు 7వేలమంది రోగులు వస్తున్నారని సీఎన్ఎన్ వార్తా సంస్థ తెలిపింది.  న్యూమోనియా బాధితుల్లో కరోనా మాదిరిగానే జ్వరం, దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఉన్నట్టు తెలుస్తోంది. తీవ్రత ఎక్కువగా ఉన్నవారు ఆస్పత్రుల్లో చేరుతున్నట్టు సమాచారం.

దగ్గు లేదా తుమ్మినప్పుడు నోరు, ముక్కుకు అడ్డుపెట్టుకోవడం,  చేతులు శుభ్రం చేసుకోవడం, రద్దీ ప్రదేశాలలో మాస్క్‌లను ఉపయోగించడం వంటివి చేయాలనీ వైద్యులు సూచిస్తున్నారు.
 
చైనాలో నెలకొన్న పరిస్థితుల్ని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, దీనిపై ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది.కేంద్ర ఆరోగ్యశాఖ ఈ విషయంపై రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది.  ముందుజాగ్రత్తలతో సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలు  ఆదేశించింది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది, బెడ్లు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, టెస్టింగ్ కిట్లు, రీ ఏజెంట్స్ ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయనేదానిపై సమీక్షించుకోవాలని రాష్ట్రాలను కోరింది. ఈ వసతులన్నీ సరిపడేలా ఉండేలా చూసుకోవాలని కోరింది. ఇవేగాక ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రోటోకాల్ పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరింది.ఈ నుమోనియా కేసులకు ఎలాంటి కొత్త వైరస్ కారణం కాదని చైనా హెల్త్ కమిషన్ క్లారిటీ ఇచ్చింది. అయినా ఈ కేసులపై మరింత సమాచారం అందజేయాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ వో) చైనా ని కోరింది.