#catholic #radioveritasasia #rvatelugu #telugucatholic #radioveritasasiatelugu #Mothermary

  • పునీత అతనాసియస్ మే 2

    May 02, 2024
    వీరు 297 సం॥ ఈజిప్టు లోని గొప్ప క్రైస్తవ కుటుంబంలో జన్మించారు.

    గొప్ప ఆశయాలు కలిగి దైవ సేవ చేయాలనే ఆశకలిగి డీకను అయ్యారు.

    తన 31వ ఎట పీఠాధిపతిగా ఎన్నికై ఎరియనిజం నశింపచేయుటలో ముఖ్య పాత్ర పోషించి, తన 76వ ఎట వేదసాక్షి మరణం పొందారు.
  • ముగిసిన ఉపదేశుల ప్రాథమిక శిక్షణ

    Apr 26, 2024
    కలకత్తాలోని నితికా డాన్ బాస్కోలో బెంగాలీ భాషలో 2022లో ప్రారంభమైన ఉపదేశుల ప్రాథమిక శిక్షణ ఏప్రిల్ 24, 2024న, డార్జిలింగ్‌లోని సొనాడ, సలేసియన్ కాలేజ్ లో, ముగిసింది.
    బెంగాలీ, హిందీ, సంథాలీ మరియు నేపాలీ భాషలలో శిక్షణ ప్రారంభించారు.

    రెండు సంవత్సరాల ప్రాథమిక శిక్షణ (BTC) నేపాలీలో రెండవ దశ శిక్షణతో ఏప్రిల్ 24, 2024న ముగిసింది.

    నేపాలీ రెండవ దశ శిక్షణలో డార్జిలింగ్ మరియు సిక్కిం ప్రాంతాల నుండి 28 మంది ఉపదేశులు పాల్గొన్నారు.

    వారు తమ శిక్షణను ఏప్రిల్ 21న ప్రారంభించి ఏప్రిల్ 24న ముగించారు.

    జాతీయ ఉపదేశుల డైరెక్టర్ గురుశ్రీ కుముదా దిగాల్,దక్షిణ ఆసియా యూత్ డైరెక్టర్ గురుశ్రీ పాట్రిక్ లెప్చా మరియు గురుశ్రీ పవన్‌జిత్ సింగ్ గార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

    డార్జిలింగ్ మేత్రాసనానికి చెందిన సలేసియన్ గురువులు మరియు మేత్రాసన గురువులు రిసోర్స్ పర్సన్‌లుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు.

    డార్జిలింగ్-సిక్కిం మేత్రానులు మహా పూజ్య స్టీఫెన్ లెప్చా గారు శిక్షణ తీసుకున్న వారిని అభినందించి ప్రోత్సహించారు.
  • ఫిలిప్పీన్స్ రెండవ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ యూత్ మినిస్ట్రీ ప్రారంభం.

    Apr 05, 2024
    ఫిలిప్పీన్స్‌, మనీలాలో జేసుసభ ఆధ్వర్యంలో నడిచే లయోలా స్కూల్ ఆఫ్ థియాలజీ (LST) నందు ఏప్రిల్ 4 నుండి 6 వరకు రెండవ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ యూత్ మినిస్ట్రీ (ICYM2024) నిర్వహిస్తుంది

    ఈ కాన్ఫరెన్స్ అటెనియో డి మనీలా గ్రేడ్ స్కూల్ మరియు లయోలా స్కూల్ ఆఫ్ థియాలజీ యొక్క హెన్రీ లీ ఇర్విన్ థియేటర్‌లో జరుగుతుంది.

    "యూత్ మినిస్ట్రీ : అందరికీ సంపూర్ణ జీవితం." అనే నేపథ్యంపై ICYM2024 జరుగుతుంది

    డాన్ బాస్కో స్కూల్ ఆఫ్ థియాలజీ ఈ కార్యక్రమం నిర్వహణలో సహకరిస్తుంది.

    కౌమారదశలో ఉన్నవారు, యువకులతో చురుకుగా పనిచేసే వారికి సేవ చేయడం ICYM2024 లక్ష్యం

    కౌమారదశలో ఉన్నవారు, క్యాంపస్ మినిస్ట్రీ మరియు యువకులతో చురుకుగా పనిచేసే వారిని లక్ష్యంగా ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటుచేశారు.

    గురుశ్రీ జెరోమ్ వల్లబరాజ్, SDB, ప్రొఫెసర్ అఫ్ యూత్ మినిస్ట్రీ ఈ సదస్సులో ప్లీనరీ కీలక ప్రసంగం చేస్తారు.

    ఈ కార్యక్రమానికి 30 దేశాల నుండి కొంతమంది ప్రతినిధులతో సహా దాదాపు 400 మంది హాజరవుతారని ఆశిస్తున్నాము.