పునీత అంతోని వారి మంటప ప్రతిష్ఠోత్సవము

జూన్ 13 , 2024 న ఉదయం 7 గంటల 30  నిమిషాలకు కర్నూలు మేత్రాసనం, పరిశుద్ధ లూర్ధుమాత కథిడ్రల్ నందు పునీత అంతోని వారి మంటప ప్రతిష్ఠ మరియు దివ్య సంస్కారాల స్వీకరణ ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమము విచారణ కర్తలు గురుశ్రీ  దేవదాస్ సిద్దిపోగుల గారి ఆద్వర్యం లో జరిగాయి.

కర్నూలు  పీఠాధిపతులు మహా.పూజ్య గోరంట్ల జ్వానేస్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని పునీత అంతోని వారి మంటప ప్రతిష్ఠ అనంతరం ఇతర గురువులతో కలసి దివ్య బలిపూజను సమర్పించారు. ఈ దివ్యబలిపూజలో 59 మంది చిన్నారులు,పెద్దలు నూతన దివ్యసత్ప్రసాదం మరియు భద్రమైన అభ్యంగనం స్వీకరించారు.

సుమారు 20 మంది గురువులు, 26 మంది మఠకన్యలు మరియు  750 మంది విశ్వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు.

విచారణ కర్తలు గురుశ్రీ  దేవదాస్ సిద్దిపోగుల గారు వచ్చిన పీఠాధిపతులు, గురువులకు  భక్తులందరికీ, కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.