ఉక్రేనియన్ ప్రజలకు సంఘీభావ లేఖను పంపిన పరిశుద్ధ పొప్ ఫ్రాన్సిస్
ఫిబ్రవరి 24, 2022న రష్యా ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దాడులు ప్రారంభించి మంగళవారం నవంబర్ 19 కి 1,000 రోజులు పూర్తయింది.
ఈ విషాద దినాన్ని గుర్తు చేస్తూ పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ మరోసారి ఉక్రేనియన్ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ ఒక లేఖను పంపారు.
ఉక్రెయిన్‌లోని అపోస్టోలిక్ నన్షియో, మహా పూజ్య విశ్వల్దాస్ కుల్బోకాస్‌కు రాసిన లేఖలో ఇలా పేర్కోనిఉంది
ప్రతి రోజు బాంబు పేలుళ్ళ వల్ల ప్రాణాలను రక్షించలేవని, వారి దుఃఖాన్ని మాన్పలేమని , గాయపడినవారిని స్వస్థపరచడం, పిల్లలను తిరిగి ఇంటికి తీసుకురావడం, ఖైదీలను స్వేచ్ఛాయుతమైన జీవితం ఇవ్వడం లేదా న్యాయం చేయలేమని , శాంతిని పునరుద్ధరించలేరని నాకు బాగా తెలుసు."
అయినప్పటికీ, నిరంతర ప్రార్థన వలన “శాంతి ” యుక్రెయిన్ లోని గృహాలు, కుటుంబాలు, వీధులలోని ప్రతిధ్వనిస్థాయి అని ఆయన అన్నారు.
యుద్ధ బాధితులందరినీ గౌరవించడం కోసం: పిల్లలు మరియు పెద్దలు, సైనికులు మరియు భయంకరమైన పరిస్థితులలో బందీలుగా ఉన్న వారికొరకు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు జాతీయ నిశ్శబ్దం నిమిషాన్ని పాటించాలని ఆ లేఖ లో పేర్కొన్నారు
ప్రార్ధించడం ద్వారా చీకటిలో కూడా దేవుని సహాయం మనకు అందుతుంది అని వ్యన ప్రార్థన యొక్క విశిష్టతను తెలియచేసారు
చివరగా, యుక్రెయిన్ విశ్వాసానికి మద్దతునివ్వడానికి తమ సేవను కొనసాగిస్తున్న పీఠాధిపతులకు, గురువులకు తన ఆశీర్వాదం అందించారు.