SIGNIS ఆసియా అసెంబ్లీకి ఆతిథ్యం ఇవ్వనున్న టోక్యో

సెప్టెంబర్ 23–27, 2024 వరకు జరగనున్న SIGNIS ఆసియా అసెంబ్లీకి టోక్యో, జపాన్,     ఆతిథ్యం ఇవ్వనుంది.

SIGNIS ఆసియా అనేది వరల్డ్ కాథలిక్ అసోసియేషన్ ఫర్ సోషల్ కమ్యూనికేషన్ వారి ప్రాంతీయ సభ /అసంబ్లీ. 

SIGNIS అనేది ప్రెస్, రేడియో, టెలివిజన్, సినిమా, వీడియో, మీడియా ఎడ్యుకేషన్, ఇంటర్నెట్ మరియు కొత్త టెక్నాలజీతో సహా కమ్యూనికేషన్ మీడియాలోని నిపుణుల కోసం గ్లోబల్ కాథలిక్ లే ఎక్లెసియల్ మూవ్మెంట్.

జపాన్‌లో జరిగే సమావేశంలో "డిజిటల్ ప్రపంచంలో మానవ సమాచారం ద్వారా శాంతి నెలకొల్పడం" అనే అంశంపై దృష్టి సారిస్తుంది.

"పరిపూర్ణ మానవ అనుసంధాన సమాచార దిశలో కృత్రిమ మేధస్సు మరియు హృదయ జ్ఞానం " అనే నేపథ్యంతో ప్రపంచ సమాచార దినోత్సవం సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ యొక్క పదునైన సందేశం నుండి ప్రేరణ పొందారని నిర్వాహకులు తెలిపారు.

జపాన్ గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు సాంకేతిక ఆవిష్కరణల నేపథ్యంలో, సామరస్యం మరియు అవగాహనతో కూడిన ప్రపంచాన్ని రూపొందించడంలో డిజిటల్ సమాచారం యొక్క లోతైన ప్రభావాన్ని అన్వేషించడానికి SIGNIS జపాన్ ఆసియా అంతటా క్యాథలిక్ ప్రసారకులను ఆహ్వానిస్తుంది.

నిర్వాహకులు నిర్ణీత సమయంలో శాంతి మరియు సమ్మిళిత సంస్కృతి వైపు పరివర్తన ప్రయాణం గురించి మరింత సమాచారాన్ని అందిస్తారు.

SIGNIS గ్లోబల్ ప్రెసిడెంట్ -హెలెన్ ఉస్మాన్ మరియు SIGNIS ఆసియా ప్రెసిడెంట్- గురుశ్రీ స్టాన్లీ కొజిచిరాతో సహా పలువురు కీలక అధికారులు కొంతమంది జపాన్ పీఠాధిపతులు ఈ సమావేశంలో ప్రసంగించనున్నారు.