బాంగ్లాదేశ్-ఎనిమిది మంది గురువిద్యార్థులు డీకన్లుగా అభిహేకింపబడ్డారు

మే 24న బంగ్లాదేశ్‌, ఢాకాలోని బనానీ-హోలీ స్పిరిట్ మేజర్ సెమినరీలో మహా పూజ్య ఇమ్మాన్యుయేల్ కె. రోజారియో గారు ఎనిమిది మంది మేత్రాసన గురువిద్యార్దులను డీకన్లుగా అభిషేకించారు.

డీ.బర్నబాస్ మోండోల్, డీ.బ్లెస్ సుమిత్ కోస్టా, డీ.లూక్ ఆల్బర్ట్ బారియో, డీ.మార్టిన్ బెనేష్ టిగ్గా, డీ.గ్రెగొరీ ముకుట్ బిస్వాస్, డీ.సాగర్ జేమ్స్ టోప్నో, డీ.షెఖోర్ ఫ్రాన్సిస్ కోస్టా మరియు డీ.సుభాష్ ఫోలియాలు బంగ్లాదేశ్‌లోని రెండు మేత్రాసనాల వారు.

ఈ డీకన్‌లు తమ తాత్విక మరియు వేదాంతశాస్త్రాలలో అధ్యయనాలను హోలీ స్పిరిట్ మేజర్ సెమినరీలో పూర్తి చేశారు.

మహా పూజ్య ఇమ్మాన్యుయేల్ కె. రోజారియో గారు,40 మంది గురువులు, 12 మఠకన్యలు, గురువిద్యార్థులు మరియు 500 మందికి పైగా విశ్వాసులు పాల్గొన్నారు.

నూతన డీకన్‌ల తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు, ఉపాధ్యాయులు మరియు సెమినరీ ఉపాధ్యాయులు వారితో పాటు వేడుకలో పాల్గొన్నారు.

తన ప్రసంగంలో, మహా పూజ్య ఇమ్మాన్యుయేల్ కె. రోజారియో గారు డీకన్‌ల ప్రవచనాత్మక పాత్రను నొక్కిచెప్పారు, వారు సమాజాలకు ప్రేమ మరియు అంకితభావంతో సేవ చేయాలని కోరారు.

సెమినరీ రెక్టార్ గురుశ్రీ పాల్ గోమ్స్, నూతన డీకన్లు తీసుకున్న బాధ్యతలను గుర్తుచేశారు.

"ఈ రోజు వారు చర్చికి సేవ చేసే బాధ్యతను స్వీకరించారు మరియు వారు ఈ కర్తవ్యాన్ని ఎంతో భక్తితో మరియు నిష్ఠతో నిర్వర్తించగలరని నేను ప్రార్థిస్తున్నాను"గురుశ్రీ పాల్  

మహా పూజ్య ఎడ్వర్డ్ కాసిడీ 1973 ఆగస్టు 23న హోలీ స్పిరిట్ మేజర్ సెమినరీని లాంఛనంగా ప్రారంభించారు.

గత ఐదు దశాబ్దాలుగా,ఈ గురువిద్యాలయం 987 మంది విద్యార్థులకు విద్యను అందించింది, 445 మంది గురువులను (9 పీఠాధిపతులతో సహా) నియమించింది మరియు దాని గౌరవప్రదమైన కార్యక్రమాల ద్వారా 83 మంది బ్రదర్ల ఏర్పాటుకు దోహదపడింది. 

103 మంది అధ్యాపకుల అంకితభావం, వారి జ్ఞానాన్ని తరతరాలుగా విద్యార్థులకు అందించింది, గురువిద్యాలయ శ్రేష్ఠత వారసత్వానికి మద్దతు ఇచ్చారు.