మానవ రక్షణ చరిత్రలో మ్రానికొమ్మల ఆదివారం ముఖ్య ఘట్టమని హైదరాబాద్ అగ్రపీఠం, లాలాగుడ, యేసు తిరుహృదయ దేవాలయం నందు మార్చి 24 2024, ఉదయం 8 గంటలకు గురుశ్రీ కుందూరు జోజి గారు మరియు విచారణ సహాయక గురువు గురుశ్రీ ప్రభాకర్ గారు మ్రానికొమ్మలను ఆశీర్వదించి విశ్వాసులకు అందజేశారు.
హైదరాబాద్ అతిమేత్రాసనం సెయింట్ మేరీస్ కేథడ్రల్ లో పవిత్ర తైలముల దివ్య బలిపూజ భక్తియుతంగా జరిగింది. అధిక సంఖ్యలో మేత్రాసన గురువులు తైలాల దివ్యబలి పూజలో పాల్గొన్నారు.
విశాఖ అతిమేత్రాసనం వేళాంగణి మాత దేవాలయం, కైలాసపురం విచారణలో తపస్సు కాల పాప పరిహార పశ్చాత్తాప ఉపవాస ప్రార్థనా కూడిక భక్తిశ్రద్ధలతో జరిగింది. విచారణ కర్తలు గురుశ్రీ సంతోష్ CMF గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
శ్రీకాకుళం మేత్రాసనం సహాయమాత దేవాలయంలో మార్చి 14 న పవిత్ర తైలముల దివ్య బలిపూజ భక్తియుతంగా జరిగింది. మేత్రాసన గురువులు తైలాల దివ్యబలి పూజలో పాల్గొన్నారు.