ఒలింపిక్స్‌లో లాస్ట్ సప్పర్ పేరడీని ఖండించిన CBCI
ఒలింపిక్స్‌లో లాస్ట్ సప్పర్ పేరడీని ఖండించిన CBCI
పారిస్ ఒలంపిక్స్ ప్రారంభ వేడుకలో లాస్ట్ సప్పర్ యొక్క పేరడీ అనుకరణను భారతీయ బిషప్‌లు మరియు లేటీ గ్రూపులు ఖండించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కథోలికులకు "లాస్ట్ సప్పర్" (కడరాత్రి భోజన విందు) ఎంతో ప్రాముఖ్యమైనది. అయితే పారిస్ ఒలంపిక్స్ ప్రారంభ వేడుకలో ప్రభు యేసు మరియు అతని పన్నెండు మంది అపొస్తలులు లా అదే విధంగా ప్రదర్శనకారులు టేబుల్ వెనుక పోజులిచ్చారు. ముగ్గురు ప్రసిద్ధ డ్రాగ్ రేస్ ఫ్రాన్స్ క్వీన్‌లతో సహా 18 మంది ప్రదర్శకులు పొడవైన టేబుల్ వెనుక పోజులిచ్చారు.
"కడరాత్రి భోజనం అనేది కేవలం కళాఖండం కాదు, యేసుక్రీస్తు స్వయంగా స్థాపించిన పవిత్ర యూకారిస్ట్ యొక్క లోతైన చిహ్నం" అని కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (CBCI) ఒక పత్రికా ప్రకటన ద్వారా పేర్కొంది.
విభిన్న సంస్కృతులు మరియు విశ్వాసాల మధ్య ఐక్యత మరియు గౌరవాన్ని సూచించే ఒలింపిక్ క్రీడలు అన్ని మత విశ్వాసాల పట్ల అత్యున్నత ప్రమాణాలను కలిగి ఉండాలని CBCI పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఫాదర్ గురుశ్రీ రాబిన్సన్ రోడ్రిగ్స్ గారు ప్రకటనలో అన్నారు.
ఈ సందర్భముగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీని "మతపరమైన భావాలను అగౌరవపరిచే ఇటువంటి సందర్భాలు మరలా పునరావృతం కాకుండా చూసుకోవాలని" CBCI పిలుపునిచ్చింది.
కార్డినల్ మహా పూజ్య ఓస్వాల్డ్ గ్రేసియాస్ గారు మాట్లాడుతూ "ది లాస్ట్ సప్పర్ అనేది ఒక పవిత్రమైన కార్యక్రమం, ఇది యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి చేసిన ఆఖరి భోజనాన్ని గుర్తుచేసుకుంటుంది మరియు ఇది క్రైస్తవ మతానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తుంది అని అన్నారు.
డ్రాగ్ క్వీన్ ప్రదర్శనను ప్రదర్శించినందుకు పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులను నటి-రాజకీయవేత్త కంగనా రనౌత్ గారు విమర్శించారు.
ఒలింపిక్స్ ప్రారంభోత్సవం అవమానకరంఅని డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer