'దేవమాత మోక్షారోపణ మహోత్సవాలు'

జ్ఞానాపురంలో ఘనంగా మొదలైన 'దేవమాత మోక్షారోపణ మహోత్సవాలు'

విశాఖ అతిమేత్రాసనం, జ్ఞానాపురంలో 'దేవమాత మోక్షారోపణ మహోత్సవాలు" విచారణ గురువులు గురుశ్రీ జొన్నాడ జాన్ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో గురువారం నాడు ఆరంభమాయ్యాయి.

మొదటి రోజు గురువారం పునీత పేతురు ప్రధాన దేవాలయంలో 'గురుశ్రీ యజ్జల మరియరత్నం' గారు ముఖ్యతిదిగా పాల్గొని ,ఇతర గురువులతో కలసి దివ్యబలిపూజ ను సమర్పించారు. సిలువగురుతు ప్రాంగణంలో దేవాలయ PPC అధ్యక్షులు 'శ్రీముసురు రాజేష్ బాబు' పండుగ జెండా ను ఎగురవేసి పతాకాఆవిష్కరణ ద్వారా ఉత్సవాలు ప్రారంభించారు.

సెబాస్టియన్ కాలనీ, బిషప్ మరియదాస్ కోలనీ, బిషప్ మైపాన్ పాల్ కోలనీ, రావులపల్లి, వడిచర్ల, నికోలాస్, దయాస్, రాసా, స్లీవగురుతు, రొసీలియన్, మాన్యువల్, సిరిల్, బరిల్, రే వీధుల్లో 'దేవమాత' తేరు ఊరేగింపు భక్తిశ్రద్ధలతో జరిగింది.

ఈ కార్యక్రమం లో గురుశ్రీ రాజేంద్ర,గురుశ్రీ వినయ్ కుమార్, గురుశ్రీ అంతొనీ రాజ్, ఆల్ ఇండియా కేథలిక్ యూనియన్ వైజాగ్ ప్రెసిడెంట్ శ్రీ 'బూర రవీంద్ర శేషుబాబు గారు మరియు భక్తసంఘాల విశ్వాసులు, మరియు వందల సంఖ్యలో క్రైస్తవులు హాజరయ్యారు.

క్రీస్తు శకం 1900 సంవత్సరం లో వచ్చిన కలరా విపత్తు వల్ల ఎంతో మంది చనిపోగా, అప్పటి బిషప్ మహా పూజ్య రోస్సియోన్ మరియు జ్ఞానాపురం ప్రజలు మోక్షారోపిత మరియ మాత ప్రార్ధనా సహాయం కోరగా, ప్రభువు దయవల్ల గ్రామం కలరా వ్యాధి నుండి విముక్తి చేయబడింది.

ఆ అధ్బుతానికి కృతఙ్ఞతగా ఆ ఏడాది 'దేవమాత తేరుతో' ఘనంగా జ్ఞానపురం పురవీధుల్లో 15 రోజులు ఉత్సవాలు నిర్వహించారు. ఆరోజు నుండి నేటి దాకా ఆ ఆనవాయితీని జ్ఞానపురంలో కొనసాగిస్తున్నారు అని పాత్రపల్లి సునీల్ కుమార్ గారు తెలిపారు.

 

Article and Design By

M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer