మొదలైన లూర్దుమాత మహోత్సవ నవదిన ప్రార్థనలు
![మొదలైన లూర్దుమాత మహోత్సవ నవదిన ప్రార్థనలు](/sites/default/files/styles/max_width_770px/public/2024-02/lurdumatha_0.jpg?itok=2DGEknBk)
మొదలైన లూర్దుమాత మహోత్సవ నవదిన ప్రార్థనలు
విశాఖ అతిమేత్రాసనము,సాలిగ్రామపురం, లూర్దుమాత దేవాలయాలం లో పండుగ నవదిన ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం సా॥ 5.30 గం॥లకు పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.
లూర్దుమాత మహోత్సవము ఫిబ్రవరి 11, 2024 న జరగనున్నది. ఈ సంవత్సరం లూర్దుమాత దేవాలయ రజత జూబిలీ(1999-2024) సంవత్సరము. నవదిన ప్రార్థనలో భాగం గా ప్రతిరోజు సా|| 6.00 గం॥లకు జపమాల, దివ్యబలి పూజ, నవదిన ప్రార్థనలు జరుగును.
పండుగ రోజు అనగా తేది 11-02-2024 ఆదివారం నాడు 4.30 గం॥లకు జపమాల, సా॥ 5.00 గ॥లకు పుర ప్రదక్షిణ, సా॥ 6.00 ని॥ లకు దివ్యబలిపూజ జరగనున్నది . విశాఖ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య డా. మల్లవరపు ప్రకాశ్ గారి చే సమిష్టి దివ్యబలిపూజ జరగనున్నది. విశాఖ అతిమేత్రాసన వికార్ జనరల్, ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ దుగ్గింపూడి బాలశౌరి గారు , విశాఖ అతిమేత్రాసన ఛాన్సలర్ శ్రీ జొన్నాడ జ్ఞాన్ ప్రకాశ్ గారు , విశాఖ అర్బన్ డీన్ గురుశ్రీ సరిసా ప్రతాప్ గారు మరియు ఇతర గురువులు ఈ దివ్యబలిపూజ లో పాల్గొంటున్నారు.
గురుశ్రీ ఎస్ విజయ్ భాస్కర్ మరియు గురుశ్రీ ఏ శ్రీధర్ గారు విశ్వాసులను ప్రేమతో ఆహ్వానిస్తున్నరు.
Article and Design By
Mkranthi Swaroop
RVA Telugu Online Producer