మహా పూజ్య. మల్లవరపు ప్రకాష్ అగ్రపీఠాధిపతుల రాజీనామాను ఆమోదించిన ఫ్రాన్సిస్ పాపు గారు.

Bishop retirement
Bishop retirement

మహా పూజ్య. మల్లవరపు ప్రకాష్ అగ్రపీఠాధిపతుల రాజీనామాను ఆమోదించిన ఫ్రాన్సిస్ పాపు గారు.

 కీశే అంతయ్య, అన్నమ్మల దంపతులకు 29  జనవరి 1949 లో హైదరాబాద్ అగ్రపీఠం,నిజామాబాద్, జాడి జమాల్పూర్ లో జన్మించారు.

పీఠాధిపతులుగా 1998–2002 కాలంలో కడప మేత్రాసనానికి తన సేవలందించారు. 2002-03 ప్రాంతంలో మహా పూజ్య మారంపూడి జోజి గారు విజయవాడ బిషప్ నుంచి హైదరాబాద్ ఆర్చ్ బిషప్‌గా వెళ్లారు. మహా పూజ్య మారంపూడి జోజి గారి  తర్వాత ఆయన స్థానంలో  కడప నుంచి మల్లవరపు ప్రకాశ్ గారు  విజయవాడ పీఠాధిపతిగా నియమితులయ్యారు.  విజయవాడ పీఠాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఏలూరు పాలనాధికారిగా కూడా తన బాధ్యతలను నిర్వహించారు. అనంతరం మహా పూజ్య కాగితపు మరియదాస్‌ రాజీనామా తరువాత విశాఖ అగ్రపీఠాధిపతులుగా మహా పూజ్య. మల్లవరపు ప్రకాష్  గారు నియమితులయ్యారు.

మహా పూజ్య. మల్లవరపు ప్రకాష్ అగ్రపీఠాధిపతుల రాజీనామాను  ఆమోదిస్తూ ఈరోజు మధ్యాహ్నం 4.30 గంటలకు ఉత్తర్వులు జారీ చేసారు.

విశాఖ అగ్రపీఠాధిపతులుగా మహా పూజ్య. మల్లవరపు ప్రకాష్  గారు ఎన్నలేని సేవలందించారు. దైవ సేవలో విశ్వాసులను ,అతిమేత్రాసన ప్రజలను ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించిన మహా పూజ్య. మల్లవరపు ప్రకాష్ గారికి  పదవి విరమణ సందర్భముగా అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం నుండి ప్రార్థన పూర్వక ధన్యవాదాలు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer