ఘనంగా ముగిసిన తెలుగు ప్రాంతీయ న్యాయవాదుల వార్షిక సమావేశం

ఘనంగా ముగిసిన తెలుగు ప్రాంతీయ న్యాయవాదుల వార్షిక సమావేశం
సికింద్రాబాద్ లోని సెయింట్స్ మేరీస్ ఫార్మసీ ఆడిటోరియంలో "తెలుగు ప్రాంతీయ న్యాయవాదుల వార్షిక సమావేశం" ఘనంగా ముగిసింది. రెండు రోజులు పాటూ జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలనుండి వచ్చిన కతోలిక న్యాయవాదులు, గురువులు , సిస్టర్స్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహాపూజ్య కార్డినల్ పూల అంతోని గారు మరియు ఏలూరు పీఠకాపరి మహా పూజ్య డా. పొలిమేర జయరావు గారు మరియు సికింద్రాబాద్ ఫామిలీ కోర్ట్ జడ్జ్ డాక్టర్ శ్యామ్ శ్రీ గారు పాల్గొన్నారు.
సెయింట్ ఆన్స్ స్కూల్ విద్యార్థులు స్వాగత నృత్యం తో అతిధులను ఆహ్వానించారు.మహా పూజ్య డా. పొలిమేర జయరావు గారు ప్రత్యేక ప్రార్థనలతో రెండవరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య వ్యాఖ్యాతగా న్యాయవాది శ్రీ మోహెద్ అసిఫ్ అంజాద్ గారు తన సందేశాన్ని అందించారు. పూజ్య డా. పొలిమేర జయరావు గారు వచ్చిన అతిధులను సన్మానించారు మరియు సెయింట్ ఆన్స్ స్కూల్ విద్యార్థులకు బహుమతులను అందించారు.
కతోలిక పీఠాధిపతుల సమాఖ్య సెక్రటరీ ఫాదర్ రాజు అలెక్స్ గారు, అమృతవాణి డైరెక్టర్ ఫాదర్ పప్పుల సుధాకర్ గారు , ఫాదర్ ఆనంద్ గారు మరియు ఇతర గురువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Article and Design by: M. Kranthi Swaroop