మతపరమైన హింసకు వ్యతిరేకంగా ఒడిశా క్రైస్తవులు

మతపరమైన హింసకు వ్యతిరేకంగా ఒడిశా క్రైస్తవులు
ఒడిశా రాష్ట్రంలో మరియు భారతదేశం అంతటా క్రైస్తవులపై హిందూ సమూహాల నుండి దాడులు పెరుగుతున్న నేపథ్యంలో సుమారు 10,000 మంది క్రైస్తవులు తూర్పు ఒడిశా రాష్ట్రంలోని రెండు నగరాల ప్రధాన వీధుల గుండా నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఆగస్టు 19న జరిగీన ఈ ర్యాలీలో పాల్గొన్న రూర్కెలా మేత్రాసనానికి చెందిన పీఠాధిపతులు మహా పూజ్య కిషోర్ కుమార్ కుజుర్ గారు మాట్లాడుతూ “ఒడిశా మరియు భారతదేశం అంతటా ఫాదర్ లు , పాస్టర్లు, సిస్టర్స్ (సన్యాసినులు) మరియు క్రైస్తవులపై హింసాత్మక దాడులు పెరుగుతున్నాయి" అని అన్నారు.
భారీ వర్షంలో సైతం ఈ నిరసన ర్యాలీ జరిగింది. ర్యాలీ తర్వాత, మహా పూజ్య కిషోర్ కుమార్ కుజుర్ గారు మరియు 20 మంది క్రైస్తవ నాయకులు జిల్లా రెండవ ర్యాంక్ ప్రభుత్వ అధికారిణి ధీనా దస్తగీర్‌కు ఒక మెమోరాండం సమర్పించారు, క్రైస్తవుల "తీవ్ర దుఃఖం మరియు ఆందోళన" ఉన్నారని, రక్షణ కల్పించాల్సిందిగా కోరారు.
అలాగే సుందర్‌గఢ్‌లో కూడా నిరసన ర్యాలీ జరిగింది. అదే మెమోరాండంను జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఉన్నతాధికారి శుభాంకర్ మోహపాత్రకు కూడా అందజేశారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు రాష్ట్రపతి ద్రౌపది ముర్ములకు ఉద్దేశించిన ఈ మెమోరాండం, భారతదేశంలోని 1.4 బిలియన్ జనాభాలో 2.3 శాతంగా ఉన్న క్రైస్తవుల "భద్రత కోసం" ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని కోరింది.
దాడులు చేసే సమూహాలు ఒడిశా మరియు పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ మరియు ఉత్తరప్రదేశ్‌లలో సామాజికంగా పేద దళిత మరియు గిరిజన క్రైస్తవులపై దాడి చేస్తున్నాయని సుందర్‌గఢ్‌లో ర్యాలీకి నాయకత్వం వహించిన ప్రొటెస్టంట్ బిషప్‌లు ప్రతాప్ ప్రధాన్ గారు మరియు జాన్ లక్రా గారు అన్నారు.
క్రైస్తవులు "ప్రతిచోటా నిరసన తెలుపుతున్నారు" అని, క్రైస్తవులకు మరియు వారి ప్రార్థనా స్థలాలు మరియు సంస్థలకు ప్రభుత్వం "తగిన రక్షణ" కల్పించాలని హక్కుల కార్యకర్త మరియు న్యాయవాది అయిన డివైన్ వర్డ్ ఫాదర్ అశోక్ మింజ్ గారు అన్నారు.
ఆల్ ఇండియా కాథలిక్ యూనియన్, ఒడిశా యూనిట్ అధ్యక్షుడు శ్రీ ఆంథ్రెస్ టిగ్గా గారు మాట్లాడుతూ, క్రైస్తవ గ్రామ స్థాయి "ప్రార్థనలు మరియు క్రైస్తవ పుట్టినరోజు వేడుకలు కూడా సమూహాల దాడులకు సులభమైన లక్ష్యంగా మారాయి" అని అన్నారు.
పాల్గొన్న క్రైస్తవులు భారతదేశం అంతటా "క్రైస్తవులపై భయంకరమైన దాడులు, వేధింపులు, బెదిరింపులు మరియు బహిష్కరణ సంఘటనలు పెరుగుతున్నాయి" అని ఆవేదన వ్యక్తం చేసారు.
Article and Design: M. Kranthi Swaroop