భక్తియుతంగా మొదలైన విభూది బుధవారం

Ash wednesday at St Mary's Basilica

భక్తియుతంగా మొదలైన విభూది బుధవారం

హైదరాబాద్ అగ్రపీఠం "సెయింట్ మేరీస్ బెసిలికా" లో విభూది బుధవార దివ్యబలి పూజ భక్తియుతంగా జరిగింది. హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు, కార్డినల్ మహా పూజ్య. పూల అంతోని గారు ఇతర గురువులతో కలసి దివ్యబలి పూజను సమర్పించారు. గురువులు , విశ్వాసులు అధిక సంఖ్యలో ఈ దివ్యబలి పూజ లో పాల్గొన్నారు. విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు.

సెయింట్ మేరీస్ బెసిలికా లో మొదటి దివ్యబలిపూజ ఉదయం 6 గంటలకుప్రారంభమైనది. విభూది బుధవార దివ్యబలి పూజ లో విశ్వాసుల నుదిటిపైన విభూదిని సిలువ ఆకారంలో గురువులు రాయడం జరిగింది.విశ్వాసులు ప్రభు యేసుని శ్రమలను,పాట్లను స్మరించుకుంటూ దివ్యబలిపూజలో పాల్గొన్నారు.

7.15 గంటలకు రెండవ దివ్యబలిపూజ అనంతరం సిలువమార్గం నిర్వహించారు. మరల మధ్యాహ్నం 12 గంటలకు సిలువమార్గం మరియు దివ్యబలిపూజ జరగనున్నది. సాయంత్రం 5 గంటలకు తెలుగులో సిలువమార్గం నిర్వహించనున్నారు. 6 గంటలకు ఇంగ్లీష్ లో దివ్యబలిపూజ అనంతరం సిలువమార్గం నిర్వహించనున్నారు.

ఈ 40 రోజుల శ్రమదినాలలో ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సిలువమార్గం నిర్వహించనున్నారు.ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ క్రిస్తు రాజ్ గారిచే ఫిబ్రవరి 23,24,25 తేదీలలో సాయంత్రం 5.30 నుండి 8.30 వరకు శ్రమదినాల ప్రసంగలు నిర్వహించనున్నారు.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer